Breaking News

నూతన పంచాయతీరాజ్ కమీషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీ రాజ్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారి గారిని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో ని రాష్ట్ర కమిటీ బృందం పంచాయతీరాజ్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశంలోనే అత్యంత గొప్ప వ్యవస్థ అని ఈ వ్యవస్థలో ఉద్యోగాలు సాధించిన మీరందరూ అత్యంత క్రమశిక్షణగా పనిచేసి ప్రజలతో సౌమ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పధకాలు ప్రజలకు చేరావేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని వ్యవస్థకు మంచి పేరు తీసుకొని రావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా,ఉపాధ్యక్షులు కె.రామకృష్ణా రెడ్డి,మహిళా నాయకులు యల్.అర్చన,పంచాయతీ కార్యదర్శుల విభాగం రాష్ట్ర కన్వీనర్ బి.రోజా ప్రకాష్,పల్నాడు జిల్లా అధ్యక్షుడు బి.రమేష్ బాబు,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *