-మే మూడో తేదీ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు
-రాజకీయ పార్టీలు కార్మిక ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తి అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని పలు రాజకీయ పార్టీల కార్మిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అపేంతవరకు పోరాడుతామని ప్రకటించారు మే మూడవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు స్థానిక గవర్నర్ పేట బాలోత్సవ భవన్ లో బుధవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ జరిగింది ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు అధ్యక్షత వహించారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు విశాఖ ఉక్కు ప్రాధాన్యత తెలిపారు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను నూరు శాతం సామర్థ్యంతో నడపాలని, సెయిల్ బిడ్ లో పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్ టేబుల్ ఏకగ్రీవంగా ఆమోదించింది 32 మంది బలిదానంతో 20వేల ఎకరాలు అప్పగించిన రైతాంగ త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు ప్రభుత్వ ఐదువేల కోట్ల పెట్టుబడికి ఇప్పటివరకు 50 వేల కోట్లకు పైగా పన్నులు చెల్లించిందని తెలిపారు. గత సంవత్సరం లాభాలలో ఉన్నదని చెప్పారు ప్రభుత్వం బ్లాస్ట్ ఫర్ నెస్ మూసివేయడంతో ఫ్యాక్టరీ సామర్థ్యం తగ్గిందని వివరించారు స్వంత గనులు లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ నాణ్యత కలిగిన ఉక్కు ఉత్పత్తి చేస్తూ విశాఖ ఉక్కు దేశంలోనే ప్రాధాన్యతను కలిగిందని చెప్పారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జరిగిన పోరాట స్ఫూర్తి తో గత రెండు సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నదని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఇవి ఏమీ పట్టించుకోకుండా పోస్కో కంపెనీకి అదానీకి ప్లాంట్ కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు ఇది కార్పొరేట్లకు మేలు చేసి రాష్ట్రానికి మాత్రం నష్టం చేస్తుందని హెచ్చరించారు రాష్ట్ర విభజనతో నష్టపోయిన మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేక విభజన హామీలు అమలు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వివరించారు ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని కూడా పరిరక్షించుకోకుంటే మరింత నష్టపోతామని చెప్పారు బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి అండగా నిలబడ్డాయని తెలిపారు కార్మిక ప్రజా సంఘాలు అనేక రూపాలలో ఆందోళనలు తెలియజేశారని రాష్ట్ర బంద్ కూడా ఈ డిమాండ్ పైన జరిగిందని గుర్తు చేశారు ఇటీవల విశాఖ పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి ఫంగన్ సింగ్ రెండు నాలుకల ధోరణితో మాట్లాడారని దాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు వైయస్సార్ టి యు రాష్ట్ర కార్యదర్శి పి గౌతం రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరహరశెట్టి నరసింహారావు రైతు సంఘం నాయకులు వై కేశవరావు ప్రభాకర్ రెడ్డి కే వి వి ప్రసాద్ కౌలు రైతు సంఘం నాయకులు ఎం హరిబాబు డివైఎఫ్ఐ నాయకులు రవన్న ఎస్ఎఫ్ఐ నాయకులు టి సోమేశ్వరరావు ఏఐటీయూసీ నాయకులు ఆర్ రవీంద్రనాథ్ కెవి సుబ్బయ్య సిఐటియు నాయకులు కే ఉమామహేశ్వరరావు ఏఐసీసీ టి యు నాయకులు కే సుధీర్ పెన్షనర్ల సంఘం నాయకులు ఎన్ ఏ శాస్త్రి రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకులు వివిఎల్ నరసింహులు ప్రజానాట్యమండలి నాయకులు పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News