విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ పండుగ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో ముస్లిం ఈద్గాహ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ మాస ఉపవాస దీక్షల ముగింపు ఈద్ ఉల్ ఫితర్ పండుగలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,ముస్లిమ్ సోదరులు నాహీద్,అలీమ్, మునీర్, అబీద్, సుభాని, ఇంతియాజ్ లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మత పెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి ఆ అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. యనమలకుదురు సూర్య స్కూల్ గ్రౌండ్ నందు తూర్పు నియోజకవర్గం 12 డివిజన్ కి చెందిన ఫారూఖ్యా మసీజ్డ్ కమిటీ వారు ఏర్పాటు చేసిన రంజాన్ ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్,అధ్యక్షలు రిజ్వాన్,మసీదు కమిటీ నాసీర్ అహ్మద్, ఖలీం, ఇబ్రహీం, మతీమ్, షరీఫ్, పోలీస్ వహీద్, పర్వేజ్, ఉస్మాన్ లతో కలిసి పాల్గొని మసీదు కమిటీ వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరసోదరిమణులు అందరికి రంజాన్ శుభాకాంక్షలుతెలియజేసారు. అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే. కుటుంబసభ్యుల్లాంటి ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రజల కోసం,ప్రత్యేకంగా ముస్లిం, మైనారిటీల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ముస్లిం సోదర,సోదరిమణులుకు అందరికి రంజాన్ శుభాకంక్షాలు తెలియజేసారు.
Prajavartha Online Telugu News