Breaking News

టీడీపీ హయాంలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కి ఏమి చేశావో చూపించే దమ్ముందా గద్దె : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత తెలుగుదేశం ప్రభుత్వం లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కి ఏమి చేశావో గద్దె రామ్మోహన్ చెప్పగలరా అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఛాలెంజ్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ నిర్మాణం తో పాటు, ప్రతి డివిజన్ లో రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణాలు,మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు సగర్వంగా చెప్పగలం అని ధీమా వ్యక్తంచేశారు. శనివారం నియోజకవర్గంలో ని పలు డివిజన్ల ముఖ్య నాయకులు వారి వారి డివిజన్ లలో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు వద్ద సెల్ఫీలు దిగి అలా చేసే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సెల్ఫీ ఛాలెంజ్ షేర్ చేశారు. తూర్పు నియోజకవర్గం లోని 21 డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్లు డివిజన్ ఇంచార్జ్ ఈరోజు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పైన సెల్ఫీ చాలెంజ్ను ప్రారంభించారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వారు సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో వైసీపీ సెల్ఫీ ఛాలెంజ్ షేర్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి కుంటిపడిందని తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తూర్పు నియోజకవర్గం లో ఎన్నడూ లేనని విధంగా అభివృద్ధి జరిగిందని, టిడిపి గద్దె రామ్మోహన్ చేస్తున్న షో సెల్ఫీ చాలెంజ్ను తిప్పుకొడుతూ ప్రజలను టిడిపి గద్దె రామ్మోహన్ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ 21 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు ఇన్చార్జిలో నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గర సెల్ఫీ దిగి తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ పోస్ట్లు చేస్తున్నారు అని అన్నారు. గద్దె రామ్మోహన్ సెల్ఫీ చాలెంజ్ అని తాను చేసిన పని ఒకటి కూడా సెల్ఫీ తీసుకోపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అసలు గద్దె రామ్మోహన్ ఏమైనా అభివృద్ధి చేశారని సూటిగా ప్రశ్నించారు? అసలు గద్దె రామ్మోహన్ కి సెల్ఫీ చాలెంజ్ అంటే ఏంటో తెలుసా అని ఎద్దేవా చేశారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కాబట్టే ఈరోజు చంద్రబాబు చెప్పినట్టు వింటూ చేతులు కాల్చుకుంటున్నారు. తూర్పు నియోజకవర్గం లోని ప్రజలందరికీ తెలుసు కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అభివృద్ధి జరిగిందని. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగి పోస్ట్ చేయాలని విమర్శించారు. తూర్పు నియోజకవర్గం లోని ప్రజలంతా వైసిపి పక్షాన ఉన్నారని తెలుగుదేశం పార్టీకి మొన్న చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి వచ్చిన ప్రజలను చూస్తే అర్థం అవ్వాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమాలు మానుకోవాలని అవునా అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *