Breaking News

మలేరియా నిర్మూలన బాధ్యత మన నుండే మొదలవ్వాలి

-మలేరియా నివారణ పోస్టర్ ను విడుదల చేసిన కలెక్టర్
-పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా, డ్రైనేజీ నీరు నిలువ లేకుండా చర్యలు చేపట్టాలి:కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా, డ్రైనేజీ నీరు నిలువ లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని మలేరియా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి నిర్మూలన కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మలేరియా వ్యాధి నివారణ ప్రతి ఇంటి నుండి మొదలవ్వాలి అని మలేరియా వ్యాధి ప్రబలకుండా దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు. ఇంటి పరిసరాల్లోని మురికి కాలువలో చెత్తాచెదారం వేయకూడదని, మురికి నీరు ఎప్పుడూ పారేటట్లు చూడాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. మురికినీటి నిల్వలో వారానికి ఒకసారి కిరోసిన్ ఆయిల్ లేదా వాడిన ఇంజన్ ఆయిల్ ను చల్లి దోమల పుట్టుకను నివారించాలన్నారు. దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లలో దోమల రిపెల్లెంట్స్, దోమ తెరలు వాడడం, ఇంటి కిటికీలకు మెష్ ఏర్పాటు లాంటి చర్యల ద్వారా దోమ కాటు నుండి రక్షించుకోవచ్చని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో మురుగు నీరు నిలవకుండా పారేలా చూడటం వలన చాలావరకు దోమలు పెరిగే అవకాశాలు తగ్గుతాయని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.శ్రీహరి, జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్, జిల్లా సర్వవలెన్స్ అధికారి హర్షవర్ధన్, దామినేడు మెడికల్ అధికారి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *