Breaking News

ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ కు వచ్చే క్రీడాకారులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2022-23 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏ.పి సి.ఎం కప్ టోర్నమెంట్‌ను 1 మే 2023 నుండి 05 మే2023 వరకు తిరుపతిలో పురుషులు మరియు మహిళల కొరకు 14 విభాగాలలో నిర్వహిస్తున్నామని, ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ కు వచ్చే క్రీడాకారులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు.

సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, మరియు డిగ్రీ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్ వి ఆర్ట్స్ డిగ్రీ కళాశాల, ఎస్ జి ఎస్ డిగ్రీ కళాశాల,శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్ లతో కలెక్టర్ మాట్లాడుతూ సిఎం కప్ టోర్నమెంట్ కు 13 ఉమ్మడి జిల్లాల నుంచి పురుషులు 2685 మంది, మహిళలు 2314 మంది వెరసి మొత్తం 4999 మంది క్రీడాకారులు హాజరు అవుతారని, అందులో ప్రతి జిల్లా నుంచి 178 మహిళలు, 179 పురుషులు వెరసి మొత్తం 357 మంది ఉమ్మడి 13 జిల్లాల నుండి హాజరవుతారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి ఏర్పాటు ఉండాలని అందుకొరకు సీఈవో సెట్విన్ సమన్వయం చేసుకుని సీఎం కప్ పోటీలకు వచ్చే వారికి సరియైన వసతి సదుపాయాలు, త్రాగునీరు, బ్లాంకెట్స్, కార్పెట్లు, భోజన వసతి, రవాణా ప్రణాలికలు సిద్ధం కావాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సిఈఓ సేట్విన్ మురళి కృష్ణ రెడ్డి, చీఫ్ కోచ్ సయీద్ సాహెబ్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *