-అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను 100 శాతం అమలు చేయాలి
-పాలనా భాష పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది : తెలుగు భాష సంఘ అధ్యక్షులు పి. విజయ బాబు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను 100 శాతం అమలు చేయాలని తెలుగు భాష సంఘ అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిఆర్ఓ శ్రీనివాసరావు అధ్యక్షతన పాలనా భాష తెలుగు భాష అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాష సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ… ప్రతి కార్యాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని తెలిపారు. మౌఖిక భాషనే పాలనా భాషగా ఉపయోగించాలని తెలిపారు. ఫైల్లు, వ్యక్తిగత రిజిస్టర్లు, లేఖలు, ప్రమోషన్లు, బదిలీలు, హాజరు పట్టిక, నోటీస్ బోర్డులు వివిధ శాఖల పేర్లు వంటి కార్యకలాపాలు అన్ని తెలుగు తెలుగు భాష లోనే ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భవిష్యత్తు తరాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
డిఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్యాలయంలోనూ పాలనా బాషగా తెలుగు భాషను 100 శాతం అమలు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. వివిద కార్యాలయ పేర్లు, నోటీస్ బోర్డులు పేర్లు, ఇతర కార్యకలాపాలు అన్ని తెలుగు భాషలోని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష సంఘ సభ్యులు మస్తానమ్మ, తళ్వా వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News