Breaking News

50 లక్షల రూపాయలతో అభిరుద్ది కార్యక్రమాలు: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం నాడు తూర్పు నియోజకవర్గం లోని 22వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్  నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అవినాష్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలు అప్పుడు ఇక్కడ ప్రజానీకానికి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ గతంలో అనేక అభిరుద్ది కార్యక్రమాలు చేశాం, అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ దదాపు 50 లక్షల అభిరుద్ది పనులకు శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక దోబీఖనాలో ప్రజల కోరిక మేరకు వృత్తి దారులు నివసించే షెడ్డు ఆధునీకరణ నిమిత్తం 27 లక్షల రూపాయల, స్వర్గపురి అవుట్ ఫాల్ డ్రైనేజీ పనులు 7 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది, అలాగే 15 లక్షల రూపాయలతో నూతన పరికరాలతో జిమ్ ఆధునికరణ చేసి ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి కాలం గడిపేరే తప్ప ఏరోజు కూడా ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు గురించి, వారికీ ఎం కావాలో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం ఆయినా చేశారా అని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన విధంగా ఏ ఒక్కరు ప్రజలు కష్టాలు తీర్చలేదు అని అవినాష్ అన్నారు. కృష్ణ లంక ప్రాతం వైస్సార్సీపీ పార్టీ కి కంచుకోట ఇక్కడ ప్రజానీకానికి ఏ అవసరం వచ్చిన ఇక్కడ వారికీ అండగా నిలబడిన పార్టీ కూడా వైస్సార్సీపీ నే అని అవినాష్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా మాటల ప్రభువత్వం కాదు ఇది పేద వాడి ప్రభుత్వం ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు నాయ్యం జరుగుతుంది అని అవినాష్ అన్నారు. ఈ కార్యక్రంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాడిపత్రి కొండారెడ్డి అధ్యక్షులు జోగారాజ వైస్సార్సీపీ నాయకులూ పులి రమణ రెడ్డి, నాగిరెడ్డి, గోపరెడ్డి, ఫేజ్లొద్దీన్, జావీద్, రహీం, బుజ్జి, చెన్నయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *