Breaking News

చేసిన అభిరుద్దిని ప్రజలకు చెప్పాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం నాడు 14 డివిజన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యకర్తలే పెద్ద సైన్యం అని అన్నారు. ప్రజా సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రేమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశయసాధనకు మన కార్యకర్తలు అందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అవినాష్ తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలను, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 14వ డివిజన్ లో జరిగిన అభిరుద్ది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అని అవినాష్ తెలిపారు. అభిరుద్ది మేమె చేశాం అని అబద్ధాలు అసత్య లా చెప్పే గద్దె రామ్మోహన్ కి గత 20 ఏళ్లగా ఇక్కడ ఉన్న సమస్యలు కనిపించలేదా అని అవినాష్ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలలో మేము ఇచ్చిన అహమి మేరకు అధికారంలోకి వచ్చాక దర్శిపేటలో ఎన్నో ఏళ్లగా ఉన్న ప్రధాన సమస్య అయిన వాటర్ పైప్ లైన్ ను పునరుద్దిచడం జరిగింది అలాగే ఎన్టీఆర్ సర్కిల్ రోడ్, ఎన్ స్ ఎమ్ స్కూల్ రోడ్, పుట్ట రోడ్డు అంబెడ్కర్ నగర్ లో నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్ ని అభిరుద్ది చేసి స్థానిక ప్రజలకు అందించడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా స్థానిక ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలు తిప్పికొట్టే విధంగా మన కార్యకర్తలంతా స్థానిక ప్రజానీకానికి మనం చేసిన సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉంది అని అవినాష్ అన్నారు. కార్యకర్తలంతా నిత్యం ప్రజల్లో ఉండి మనం చేసిన మంచిని ఒకటికి పది సార్లు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రజలకు వివరించాలని అవినాష్ చెప్పారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన క్లస్టర్ ఇన్ చార్గ్స్ కి, కన్వీనర్లకు, గృహ సారధులకు అభినందనలు తెలియజేసారు వీరికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని అవినాష్ అన్నారు. రానున్న కాలంలో అందరూ కూడా భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య అధ్యక్షులు శెట్టిఖం దుర్గా ప్రసాద్, చిమాట బుజ్జి, సుబ్బరాజు, చెలపాటి సన్నీ, పర్వతనేని గోవర్ధన్, ఊకోటి రమేష్, మరీదు ఉమా,మల్లెల లక్ష్మీనారాయణ, మరియు షేక్ భాదులా, వై.యస్.ఆర్.సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *