Breaking News

నాణ్యమైన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యమైన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యం అని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో మే 9 నుండి ప్రారంభం కానున్న స్పందన – జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వివిధ విభాగాల సూపరిండెంట్లు, స్పందన అధికారులు, ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇచ్చే స్పందన కార్యక్రమం కన్నా మెరుగైన పరిష్కారం, అధికారుల్లో జవాబుదారీతనం కోసం వచ్చే నెల 9 నుండి జగనన్నకు చెబుదాం ని ప్రారంభిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 1902 హెల్ప్ లైన్‌ ఏర్పాటు చేశారని, హెల్ప్ లైన్ కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే దాన్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. పరిష్కారం పై అన్ని స్థాయిల్లో మానిటరింగ్ విభాగాలు కూడా ఉంటాయన్నారు. గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌ లైన్‌ కు గ్రీవెన్స్‌ వస్తాయని వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందుతాయని, సమస్యల పరిష్కారంపై అర్జీదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుందన్నారు. వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌ లైన్‌ గురించి అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్o డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, ఈ-డిస్ట్రిక్ అధికారి రత్నం, స్పందన అధికారులు, విభాగ సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *