విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
11వ డివిజన్ లకు చెందిన అనంత రామ కృష్ణమ్మ తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అప్లికేషన్ పెట్టుకోగా వారికి వైద్య చికిత్స నిమిత్తం దాదాపు 1,30,000/- రూపాయలు మంజూరు కాగా గురువారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు చేతుల మీదుగా కార్యాలయ సిబ్బంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యం తో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సీఎం జగన్మోన్ రెడ్డి గారు నిధులు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి నిరుపేదల వైద్య సేవలు మేయు సమస్యల గురుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారి సమస్యల పరిష్కారానికి ఆయన తక్షణమే స్పందించే తీరు, కృషి అభినందనీయమని కొనియాడారు. అందరు ఆరోగ్యముగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ప్రభుత్వ పల సాగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ,ఎన్టీఆర్ జిల్లా సేవా దళ్ ప్రెసిడెంట్ కావాటి దామోదర్, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంగా రాజ్ కమల్,బచ్చు మురళి, పాల్గొన్నారు.దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం తూర్పు నియోజకవర్గం 20 డివిజన్ కు చెందిన బొమ్మారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక వైస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకురాగా గురువారం నాడు సత్యవతి గారికి వైద్య సేవలు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు సహాయం అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News