-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ శుక్రవారం అధికారులతో కలిసి పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 56 వ డివిజన్ పాతరాజరాజేస్వరి పేటలో జె.పి.అపార్ట్మెంట్ నందు మరియు 57 వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరీ పేట మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మేజరు అవుట్ ఫాల్ డ్రెయిన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా 56 వ డివిజన్ పాతరాజరాజేస్వరి పేట లో జె.పి.అపార్ట్మెంట్ నందు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదల నిలిచిపోవడం వలన ఓవర్ ఫ్లో అవ్వడం మరియు నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు కాలువల ద్వారా ప్రవహించకుండా రోడ్ల మీద నిల్వ ఉండుట గమనించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా విభాగము వారు సమన్వయంతో పని చేసి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మ్యాన్ హోల్, కల్వర్ట్ మూతలు తీసి శుభ్రపరచి, నీటి పారుదల సక్రమముగా ఉండునట్లుగా చూడాలని ఆదేశించారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణకు అవరోధoగా కాలువల మీద ఆక్రమణలను తొలగించుట, డ్రెయిన్స్ నందు పూర్తి స్థాయిలో సిల్ట్ తొలగించుట, కాలువలలో చెత్త వ్యర్ధపదార్దములు పడకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
తదుపరి న్యూ రాజరాజేశ్వరీ పేట ఆయా మేజరు అవుట్ ఫాల్ డ్రైయిన్స్ లో సిల్ట్ తొలగింపు పనులు యుద్దప్రాతిపధికన చేపట్టి మురుగునీరు సక్రమముగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రెయిన్ నందు సిల్ట్ తొలగించు సమయంలో వాహనములను ఏర్పాటు చేసి నేరుగా అక్కడ నుండి సిల్ట్ తొలగించాలని సూచించారు. సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 56 వ డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు, చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News