గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ మేరకు ప్రధాన కాల్వల్లో పూడిక తీత పనులకు టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో నగరంలో మాన్ సూన్ యాక్షన్ ప్లాన్, అభివృద్ధి పనుల వేగవంతం పై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ మేరకు పూడికతీత పనులు పక్కగా జరగాలని, పనులకు ముందు తర్వాత ఫోటోలతో ఫైల్ ఉండాలన్నారు. పనులను ఆకస్మికంగా తనిఖీలకు వస్తామని, తీసిన పూడికను ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా తరలించాలని ఆదేశించారు. నగరంలో చేపట్టిన పార్క్ ల అభివృద్ధి పనులు నిర్దేశిత గడవు ప్రకారం జరగాలన్నారు. పార్క్ ల్లో సివిల్ పనులు జరిగిన వెంటనే గ్రీనరీ అభివృద్ధికి ఏడిహెచ్ చర్యలు తీసుకోవాలన్నారు. ఐలాండ్స్ పనులు కొన్ని చోట్ల నత్త నడకన జరుగుతున్నాయని తదుపరి సమీక్షా సమావేశం నాటికి పూర్తి అయ్యేలా చూడాలని ఈ.ఈ.లను ఆదేశించారు. నాడు నేడు లో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని, పనులు అవుతున్న మేరకు బిల్స్ ఆన్ లైన్ ద్వారా ప్రాసెస్ చేయాలన్నారు. రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో డ్రైన్లు నిర్మాణాలు ఈ.ఈ.లు వేగంగా జరిగేలా చూడాలన్నారు. అభివృద్ధి పనులు జరిగే ప్రాంతాల్లో ఇతర విభాగ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ.ఈ.లు తమ పరిధిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు రాకుండా పర్యవేక్షణ చేయాలని, సచివాలయాల వారిగా ఎమినిటి కార్యదర్శులు పైప్ లైన్ లీకులు, కలుషిత నీటి సరఫరా పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు వాటర్ స్యాంపిల్స్ తీయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమోదించిన అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, పనులను ఏ.ఈ.లు ప్రత్యేక భాధ్యత తీసుకొని పూర్తి చేయాలన్నారు. మేజర్ డ్రైన్లలో పూడికతీత పనులకు టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. టెండర్ పొందిన పనులు నిర్దేశిత గడవు మేరకు జరగాలని, ఎక్కడా పనుల్లో జాప్యం లేకుండా ఇంజినీరింగ్ అధికారులు నేరుగా పర్యవేక్షణ చేయాలన్నారు.
సమావేశంలో ఎస్.ఈ. భాస్కర్, ఈఈలు సుందర్రామిరెడ్డి, శాంతిరాజు, కొండారెడ్డి, కోటేశ్వరరావు, ఏడిహెచ్ రామారావు, డిఈఈలు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News