Breaking News

“శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి” ఆలయాన్ని అభివృద్ధి పరచవలసిన అవసరం వుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం”గొమ్ముగూడెం” గ్రామంలోని “శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి” ఆలయాన్ని అభివృద్ధి పరచవలసిన అవసరం వుందని ఆంధ్రప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడెమి సెక్రటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ దేవాదాయ కమీషనర్ ఎస్. సత్యన్నారాయణ దృష్టి కి తెచ్చారు. కమీషనర్ సత్యన్నారయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా తిలక్ కలిసిన సందర్భంగా పై విజ్ఞప్తిని చేశారు. పవిత్ర గోదావరి నదీతీరంలోని యీ ఆలయాన్ని 11 వ శతాబ్దం లో కాకతీయ ప్రభువులు నిర్మించారని కమీషనర్ కు తిలక్ వివరించారు. ఈ ఆలయాన్ని సందర్శించాలని కమీషనర్ ని ఆయన కోరారు. త్వరలో తప్పక సందర్శిస్తామని కమీషనర్ హామీ యిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *