-ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి..
-జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శిశువు పుట్టిన వెంటనే ఆధార్ నమోదు చేయించడంతో పాటు ఐదేళ్లుపూర్తయిన వెంటనే బయోమెట్రిక్ నమోదు చేయించాలని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయం నుండి శనివారం ఆధార్ నమోదుపై జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డిల్లీరావు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన ప్రతి శిశువుకు ‘‘శిశు యాప్’’ ద్వారా తల్లిదండ్రుల ఆధార్ వివరాలతో తప్పనిసరిగా చైల్డ్ ఆధార్ నెంబర్ నమోదు చేయాలని అన్నారు. ఐదు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తి అయిన తర్వాత పిల్లల ఫింగర్ ప్రింట్ తో బయోమెట్రిక్ సీడిరగ్ చేయించాలన్నారు. శిశు ఆధార్ ప్రై ప్రైవేటు ఆసుపత్రులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులలో తప్పని సరిగా శిశు ఆధార్ నమోదు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఇప్పటికే ఆధార్ కలిగి 10 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా ఆధార్ వివరాలను ఆప్‌డేట్ చేయించుకోవాలన్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పోస్టాఫీసులు, జాతీయ బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్, తదితర కేంద్రాల వద్ద ఆధార్ నమోదు అప్డేట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారి ఆధార్ నమోదు నవీకరణ నూరు శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ అప్డేట్ ఉచితంగా రెండు సార్లు చేయవచ్చని, విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ అప్డేట్ చేయించుకుంటేనే భవిష్యత్ సంక్షేమ పథకాలు పొందేందుకు వీలవుతుందని అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అయిఉండాలన్నారు. ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో చేపట్టాలన్నారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబరు 1947 లేదా ష్ట్రవశ్రీజూఏబశ్రీసaఱ.స్త్రశీఙ.ఱఅ. వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు. లేదాగ్రామ వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించాలని కలెక్టర్ డిల్లీరావు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. జామ్ కాన్ఫరెన్స్‌లో కన్వినర్, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, జడ్పిసిఇవో జ్వోతిబసు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిని డా. యం సుహాసిని, డిఇవో సివిరేణుక, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, యూఐడిఏఐ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News