సామాజిక సేవలకు అధ్యుడు జాన్ హెన్రీడూన్ హాంట్ ఆదర్శప్రాయులు…
రెడ్‌క్రాస్‌లో భాగస్వామ్యులై సామాజిక సేవలు అందించండి…
జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంనందు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సోసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హాంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సోసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హాంట్ 300 సంవత్సరాల క్రితమే సామాజిక సేవలకు శ్రీకారం చుట్టారన్నారు. యుద్దరంగంలో ప్రాణాలు కోల్పోయిన వారు కుటుంబాలను క్షతగాత్రులైయిన వారు దిక్కుతోచని పరిస్థితులను గమనించి సేవల చేసి ఆదుకోవాలన్న ఆలోచన జాన్ హెన్రీడూన్ హాంట్ మదిలో నేలకోందన్నారు. ఆయన ఆలోచనలకు కార్యరూపమై నేటి ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ అని అన్నారు. వివిధ సమస్యలతో బాదపడుతున్న వారికి వాలంటీర్‌గా సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని రెడ్‌క్రాస్ సభ్యులుగా చేర్పించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తులు, ప్రకృతి వైపరిత్యాల సమయాలలో భాధితులను ఆదుకుని ఆసరా కల్పించడం, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పరంగా పేదలకు ఆర్థిక చేయూతను అందించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ పాత్ర మరువలేనిదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచంలో అన్ని సేవా సంస్థలలో రెడ్‌క్రాస్‌కి అందిన విరాళాలలో 90 శాతం సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుందని ఇప్పటివరకు నాలుగు సార్లు నోబుల్ బహుమతి పొందిన ఏకైక సంస్థ ఇండియన్ రెడ్‌క్రాస్‌కే దక్కిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు ఉచితంగా రక్తాన్ని అందించడంతో పాటు గుండె జబ్బుల నివారణ (సిపిఆర్) పై ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్రంలోనే ్ల రెడ్‌క్రాస్ సంస్థ అగ్రగామీగా నిలిచిందన్నారు. గుండె జబ్బులపై అవగాహన కల్పించి ప్రాధమిక చికిత్స అందింస్తే 70 శాతం మంది ప్రాణాపాయ స్థితి నుండి రక్షించగలుగుతారన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీకి ఆర్థిక సహాకారం అందింస్తున్న జిల్లా అధికారులు ఉద్యోగులను అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా అధ్యక్షులు డా. జి సమరం మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహకారంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ సేవాలను విసృత్త పరుస్తున్నామన్నారు.పాఠశాలలు, కళాశాలలో యూత్ రెడ్‌క్రాస్ ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించి ప్రాణాపాయ పరిస్థితులో ఉండి రక్తం అవసరమైన వారికి ఉచితంగా రక్తాన్ని అందజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాలలో వాలంటీర్లకు గుండె పోటు నివారణ ప్రాధమిక చికిత్స పై శిక్షణ అందించి వారి ద్వారా ప్రతి కుటుంబంలోని సభ్యులకు వివరించడం ద్వారా గుండె పోటుకు గురి అయిన వారికి ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాపాయ స్థితినుండి రక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రకృతి వైపరిత్యాలు, విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలు జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు రెడ్‌క్రాస్ సోసైటీ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుందని డా జి సమరం తెలిపారు.అనంతరం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సోసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హాంట్ జన్మదిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు పారిశుద్ద్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి వారికి హైజనిక్ కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, ఇండియన్ రెడ్‌క్రాస్ ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డా. ఇళ్లా రవి, రెడ్‌క్రాస్ మేనేజిమెంట్ కమిటీ సభ్యులు డిఎస్‌బిఎస్ బాలసుబ్రామణ్యం, అసిస్టెంట్ మేనేజర్ పి. సునీత, వివిధ శాఖల అధికారులు, రెడ్‌క్రాస్ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News