రాజమహేంద్రవరం :నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి చెందిన క్రమ శిక్షణా చర్యలకు చెందిన పూర్తి సమాచారాన్ని జిల్లా, డివిజన్, మండల పరిధిలోని డ్రాయింగ్ అధికారులు సి సి ఎఫ్ ఎమ్ ఎస్ వెబ్ సైట్ లో మే 11 లోగా అప్లోడ్ చెయ్యలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు.సోమవారం కలెక్టరేట్ లో జిల్లా ట్రెజరీ అధికారి రాష్ట్ర ఖజానా శాఖ విడుదల చేసిన ఉత్తర్వులపై అధికారులకు జేసీ సమక్షంలో వివరాలు తెలియచేశారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, సంబందించిన డిడివో ల ద్వారా చేపట్టవలసిన ప్రక్రియ పై డాక్యు మెంట్ రూపొందించి సమాచారం అందచేయాలని అదేశించారు.ఈసందర్భంగా డీటీఓ ఎన్. సత్యనారాయణ వివరాలు వివరిస్తూ జిల్లా లో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది కి చెందిన పెండింగ్ లో ఉన్న క్రమ శిక్షణ తదితర అనుబంధ వివరాలు “సి ఎఫ్ ఎమ్ ఎస్” వెబ్ సైట్ నందు అనుసంధానం( డేటా ఎంట్రీ) మే 11 లోగా పూర్తి చెయ్యవలసి ఉందన్నారు. తదుపరి జిల్లా స్థాయి సమగ్ర నివేదికను క్రోడీకరించి నెల 15 వ తేది లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని తెలిపారు. అప్లోడ్ చేయవలసి ఉన్న డాక్యు మెంట్లు, తదితర అంశాలపై డ్రాయింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం తో పాటు, అందుకు చెందిన మార్గదర్శకాలను తెలియ చేస్తామని అన్నారు. ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా, డివిజన్, మండల పరిధిలోని ట్రెజరీ అధికారులు ద్వారా డి డి ఓ లకు అవగాహన కల్పించనున్నట్లు సత్యనారాయణ తెలిపారు.
Prajavartha Online Telugu News