Breaking News

సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు చేయడానికి జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నంబర్ 1902

-సంతృప్త స్థాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం:సిఎం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క ప్రజానీకానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై మరియు టోల్ ఫ్రీ నంబర్ 1902 నంబర్ పై అవగాహన కల్పించాలని, స్పందన గ్రీవెన్స్ కు మెరుగులు దిద్ది ప్రజల సమస్యలకు నాణ్యమైన, సత్వర పరిష్కారం కొరకే ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం అని తెలుపుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నేటి మంగళవారం ఉదయం గౌ. ముఖ్యమంత్రి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో జగనన్నకు చెబుదాం వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసి, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా వారికి దిశా నిర్దేశం చేశారు. వివక్షలేని, అవినీతి లేని పారదర్శక పాలన, అర్హులైన లబ్ధిదారులకు నిజాయితీగా సంక్షేమ ఫలాలు అందించే దిశలో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుండి గ్రామ సచివాలయం ఉద్యోగి వరకు ప్రజా సేవకులు అని, ప్రజలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని అని తెలిపారు. గ్రామ స్థాయిలో ఉండే సచివాలయాలు, ఆర్బికే లు, అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, నాడు నేడు పాఠశాలలు వంటి వాటిని గ్రామ సందర్శనలో భాగంగా అధికారులు తనిఖీలు చేసి సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించేలా ఉండాలని, తదనుగుణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయని హితవు పలికారు. సంతృప్త స్థాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జెసి డి కె బాలాజీ, జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరయ్యారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అందరూ అధికారులు ముఖ్య మంత్రి సందేశాన్ని వీక్షించడం, పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకట్రావ్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *