విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల ప్రమాదవశాత్తు ఆడుకొంటు డ్రైనేజీ కాలువలో పడి మృతిచెందిన తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ కు చెందిన ఆరేళ్ళ బాలుడు అభిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించి మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పిన నగర పార్టీ అధ్యక్షులు శ్రీ బొప్పన భవకుమార్ ,రాష్ట్ర పార్టీ నాయకులు శ్రీ కడియాల బుచ్చిబాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం గురుంచి తెలియగానే విదేశాల్లో ఉన్న నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ నాయకులను, అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించేలా పలు సూచనలు చేసారని అన్నారు. దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందడం బాధాకరం అని వెంటనే అవినాష్ గారు మున్సిపల్ కార్పోరేషన్ నుండి లక్ష రూపాయల పరిహారం వారి కుటుంబానికి అందజేయడంతో పాటు నేడు వారి ట్రస్ట్ ద్వారా 50వేల రూపాయలు అందించి వారికి ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా ట్రస్ట్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది నిత్యం వారి కుటుంబానికి అండగా ఉంటూ చేదోడు వాదోడు గా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ,యువజన విభాగం అధ్యక్షులు శ్రీ కొరివి చైతన్య ,4వ డివిజన్ నాయకులు శ్రీ గల్లా రవి ,వైసీపీ నాయకులు NSI రాజు,సొంగా రాజ్ కమల్,బొడ్డు తరుణ్, కొత్తపల్లి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News