Breaking News

శుద్ధ తిరుమల – సుందర తిరుమల” కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ఉద్యోగులు స్వచ్చందంగా పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దాం : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు మే13న తిరుమల మార్గాల్లో జిల్లా యంత్రాంగం తరపున అధికారులు స్వచ్చందంగా పాల్గొని “శుద్ధ తిరుమల – సుందర తిరుమల” గా తిరుమల మార్గాన్ని మార్చడానికి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దామని జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు, రెండు నడకదారుల్లో మే 13న శనివారం టిటిడి ఉద్యోగులతో కలిసి జిల్లా యంత్రాంగం తదితరులతో సామూహికంగా “శుద్ధ తిరుమల – సుందర తిరుమల” కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని మన తిరుమల మార్గాన్ని స్వఛ్చతగా ఉండేలా మన వంతు స్వఛ్చందంగా కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం కు చెందిన వివిధ శాఖల అధికారులు అలిపిరి మార్గంలో సుమారు రెండు నుండి మూడు కిలో మీటర్ల మేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంతో తిరుమలను పర్యావరణహితంగా మార్చడంపై భక్తులకు సామాజిక స్పృహ అవగాహన వస్తుందని, తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను తీసుకురావడాన్ని పూర్తిగా నివారించుటలో భాగంగా కూడా ఈ కార్యక్రమం ఒక మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ఉద్యోగులు అంకితభావంతో పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి తదితర వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *