Breaking News

వైద్య ఆరోగ్యశాఖ పారామీటర్ల లక్ష్యాలలో మెరుగైన ఫలితాలు ఉండాలి

-వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సక్రమంగా పేదలకు వైద్య సేవలు అంకితభావంతో అందించాలి
-విధులలో నిర్లక్ష్యం వహిస్తే వైద్య ఆరోగ్య శాఖ మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులపై చర్యలు తప్పవు: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏఎన్ఎం డిశ్చార్జ్ ఫీడ్బ్యాక్, ఎన్సీడీ సీడీ సర్వే, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు, కంటి వెలుగు, అనీమియా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి వైద్యశాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై డిప్యూటీ డిఎంహెచ్వోలు, మెడికల్ ఆఫీసర్లు, అర్బన్ పిహెచ్సిల డాక్టర్లు, ప్రోగ్రామ్ అధికారులు, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష చేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రజాసేవ కొరకే మనం ఉన్నామని గుర్తుంచుకొని అంకితభావంతో పనిచేయాలని హితవు పలికారు.

శుక్రవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా ఏఎన్ఎం డిశ్చార్జ్ ఫీడ్బ్యాక్ బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా సకాలంలో పనిచేసే విధంగా పనితీరులో చాలా మెరుగుపడాలని దీనిని వైద్యాధికారులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ నిరంతర పర్యవేక్షణ చేస్తూ మెడికల్ పారామీటర్లలో వెనుకబాటు తనం లేకుండా పనిచేయాలని సూచించారు.ఎన్ సి డి, సి డి సర్వే లో భాగంగా జిల్లాలోని ప్రజలకు అందరికీ ఈ సర్వే చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని గుర్తించి మిగిలిన వారికి సర్వే చేసి అందులో జబ్బులు గుర్తించిన వారికి బిపి, షుగర్ తదితర జబ్బులకు తప్పనిసరిగా డాక్టర్లు చెక్ అప్ చేసి మందులు అందించి ఫాలో అప్ ఉండాలని, దీనిని సీరియస్ గా తీసుకొని వైద్య అధికారులు పూర్తి పర్యవేక్షణతో పనిచేయాలని, లేనిచో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంలో ఇద్దరు పిహెచ్సి డాక్టర్లు ఉన్నా కూడా ఓపి తగినంత చేయడం లేదని, దీనిపై దృష్టి సారించి జిల్లాలోని నలభై 104 వాహనాలు 85 పీహెచ్సీ పరిధిలో పరీక్షలు నిర్వహించే తేదీలు ముందుగానే తెలిపి ఉదయం ఓపి నిర్వహించి మధ్యాహ్నం మంచానికే పరిమితమైన రోగులకు, ఆరోగ్యశ్రీ సర్జరీలు చేసుకున్న వారికి గృహ సందర్శనతో ఫాలోఅప్ మందులు అందించాలని సూచించారు.

డిప్యూటీ డిఎంహెచ్వోలు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్లను మ్యాపింగ్ చేయడం ద్వారా అనీమియా పర్యవేక్షణ చేసి వారికి చికిత్స అందజేయడం వంటివి బాధ్యతాయుతంగా చూడాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని డాక్టర్లతో స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు. సర్జరీల నిర్వహణకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో సక్రమంగా ఎక్కించడం లేదని ఆరోగ్య శ్రీ హాస్పిటల్ లో, ప్రభుత్వ ఆసుపత్రులలో చేస్తున్న సర్జరీల వివరాలతో ఆన్లైన్ ఎంట్రీ పక్కాగా నమోదు కావాలని వైద్య ఆరోగ్యశాఖ పారామీటర్లలో అన్నింటిలో వచ్చేవారం నిర్వహించే సమావేశంలోపు పురోగతి చూయించాలని లేదంటే సదరు వైద్యాధికారి పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ ను సమీక్షిస్తూ అంగన్వాడీ ద్వారా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అందజేస్తున్న సేవలు, గర్భిణీలకు అందజేస్తున్న వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ తదితర అంశాలు పక్కాగా అమలు కావాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. సిడిపివోలు సూపర్వైజర్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పనితీరు మార్చుకొని మెరుగైన సేవలు ప్రజలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. పనితీరు మెరుగుపడకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, జిల్లా టీబి కంట్రోల్ అధికారిని అరుణ సులోచన దేవి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, వైద్యాధికారులు సిడిపివోలు సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *