-ఊహకు అందనంత ఎత్తులో గంగమ్మ జాతర
-శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో మహాద్భుతంగా గంగమ్మ జాతర ఉత్సవాలు
-పట్టణ ప్రజలు కాకుండా చుట్టూ ప్రక్కల జిల్లాల,రాష్టల నుండి భక్తులు తరలి వస్తున్నారు
-జిల్లా ఎస్ పి, నగర మేయర్ గంగమ్మ తల్లికి సారె సమర్పించారు
-స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష్,జిల్లా ఎస్ పి ఇరువురు తమ కుటుంబ సభ్యులుతో కలసి, ఊరేగింపు గా విచ్చేసి గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగర పాలక సంస్థ మేయర్, జిల్లా ఎస్పీ తన కుటుంబ సభ్యులతో కలసి గంగ జాతర మూడవ రోజున శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగమ్మ ఆలయం వద్ద మీడియా తో మాట్లాడుతూ గంగమ్మ ను దర్శించుకోవడానికి భక్త్తులు తండోపాతండాలు గా గంగమ్మ దర్శనానికి వస్తున్నారుని తెలిపారు. ఊహకు అందనంత ఎత్తులో గంగమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయని. తిరుమల లో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో మహాద్భుతంగా గంగమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నని తెలిపారు. పట్టణ ప్రజలు కాకుండా చుట్టూ ప్రక్కల ప్రాంతాలు జిల్లాల,రాష్టల నుండి భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఊహకు అందని విధంగా గంగమ్మ జాతర జరుగుతోందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. బ్రహ్మోత్సవాల తరహాలో గంగమ్మ జాతర మహాద్భుతంగా జరుగుతుందని పునరుద్ఘాటించారు. ప్రజలు స్వచ్చందంగా భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లికి సారె సమర్పిస్తున్నారు.
గంగమ్మ జాతర ప్రాశస్థ్యం, చరిత్ర, విశిష్టత గురించి ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లామన్న సంతృప్తి తమకు కలిగిందని, అందుకు అనుగుణంగానే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి గుడికి విచ్చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున తోటి వేషధారణలతో శుక్రవారం మూడవ రోజు విచ్చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ తమ భక్తిప్రపత్తులు చాటుతున్నారుని వివరించారు. అందుకే ఈ విషయంలో మాకు చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రాచీన కలలు కనుమారుగున పడుతున్న సమయంలో గంగమ్మ జాతర సందర్భంగా మహా భారతం,రామాయణం పద్య,గేయ నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 9 రోజుల పాటు రాత్రి 8 గంటలకు ఇందిరా మైదానం నందు గంగమ్మ ఆలయ నిర్వహుకులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు చూచి ఆనందించాలని చూచించారు.
ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రమణ్యం, నగర పాలక సంస్థ కమిషనర్ హరిత,సహాయ కమీషనర్ సునీత, డిప్యూటీ మేయర్లు అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, ఆలయ పాలక మండలి చైర్మన్ గోపి యాదవ్,ఈఓ మునికృష్టయ్య,డాక్టర్ ముని శేఖర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News