విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యరంగంలో నిస్వార్థమైన సేవలలో తరిస్తున్న నర్సులే ప్రతి ఒక్కరికి అసలైన మాతృమూర్తులని వారి సేవలు రోగుల హృదయాలలో ఎన్నటికీ చిరస్మరణీయులుగా నిలిస్తారని ఏపిఎన్జివో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు.
అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక గాంధీనగర్ లోని ఏపిఎన్జివో హోమ్ నుందు నర్సులకు ఎక్జివో అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ. విద్యా సాగర్ మాట్లాడుతూ వైద్యరంగంలో రోగులకు సేవలందించడంలో తరిస్తున్న నర్సులే అసలైన మాతృమూర్తులని నర్సుల సేవలు మరువలేనివని ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్మరనీయంగా గుర్తు ఉండిపోతారని అన్నారు. ప్రతి ఒక్కరూ జన్మించిన వెంటనే మొట్టమొదటి సారిగా సర్సునే చూస్తారని ఆ తరువాతే తల్లిని లోకాన్ని చూడగలుగుతారని అన్నారు. ఇంతటి మహ భాగ్యం మరి ఎ జీవికి రాదన్నారు. కోవిద్ వంటి అంటు రోగాల సమయంలో నర్సులు వారి ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం వనంగా పెట్టి వైద్య సేవలు అందించడం ద్వారా ఉదర స్వభావాన్ని చాటుకుంటున్నారన్నారు. లండన్ లోని మహిళ ఆసుపత్రిలో సూపరిండెంట్గా పనిచేస్తూ ఫోరెన్స్ నైటింగేల్ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు సేవలు అందించి నర్సింగ్ వృత్తికే వన్ని తెచ్చారన్నారు. ఆమె సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సర్సెస్ సంస్థ నైటింగేల్ పుట్టిన రోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆమెను స్పూర్తి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ అలుపెరగని సేవలు అందిస్తున్న నర్సులను గౌరవించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. వృత్తి పరంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకువచ్చి పరిశీలించేందు ఏపిఎన్జివో. అసోసియేషన్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. వృత్తితో పాటు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తపులోనే దాచుకుని చిరునవ్వులతో రోగులకు సేవలందిస్తున్న నర్సులను సత్కరించుకోవడం భాధ్యతగా గుర్తించాలన్నారు.
అనంతరం దంతవైద్యశాలకు చెందిన కె. శివలీల, వి.రాణి, పాత ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన కె. ఇందిరాదేవి, బి విజయశ్రీ, సిహెచ్ కళ్యాణి, టీ తబిత, యం ఝన్సీరాణి, నూతన జనరల్ ఆసుపత్రికి చెందిన ఎస్.కె. షమావల్లాబేగం, డి. కనకదుర్గలను ఘనంగా సన్మాణించారు. కార్యక్రమంలో ఏపిఎన్జివో అసోసియేషన్ కోశాధికారి బి సతీష్ కుమార్, సహాధ్యాక్షులు బి వి రమణ, ఉపాధ్యాక్షులు యం రాజబాబు నగరశాఖ కార్యవర్గ సభ్యులు సిహెచ్ శ్రీరామ్, కె. సంపత్ కుమార్, వి.వి. ప్రసాద్, నాజీర్ ఉద్దీన్ కాశీంసాహేబ్, శివశంకర్, శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News