Breaking News

పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నగరంలో ఇంటెన్సివ్ నైట్ పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శనివారం రాత్రి అధికారులతో కలసి పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించారు. 23 వ డివిజన్ లోని డోర్నకల్ రోడ్డులో, మరియు 28 వ డివిజన్లలో భగత్ సింగ్ రోడ్లలో హోటల్స్, వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్ల తో పాటు ఇతర వ్యాపారదారులు చెత్తను రోడ్ల పై వేసే వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించారు ఈ సారి వినకపోతే తగిన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్నారు. తడి, పొడి చెత్తను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు అందించాలని సూచించారు. చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని అవగాహన కల్పిస్తూ సచివాలయాల పరిధిలోని ప్రతీ ఇంటికి నోటీసులు అందించాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.

తదుపరి 59 వ డివిజన్ లోని క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ పనులను పరీసిలించిన కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ గారు. యూజర్ చార్జీలను క్రమం తప్పకుండా చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజనుల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. విజయవాడ నగరవాసులకు తెలియజేయునది ఏమనగా, నగరపాలక సిబ్బందివారు అన్ని వార్డులలో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ చేస్తున్నారు. ఈ నిర్వాహణకు నివాసితులు మరియు పౌరులు అందరూ తమ ఇళ్లు, దుకాణాలు మరియు వ్యాపారసంస్థలలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను తమ వద్దనే వేరుచేసి తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలలో, పొడి చెత్తను నీలిరంగు డబ్బాలలో, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో మరియు శానిటరీ వ్యర్థాలను విడిగా వేరుచేయాలి మరియు వాటిని విడివిడిగా చెత్త సేకరణ సిబ్బందికి అందజేయవలెను అని కమిషనర్ అన్నారు.

అదేవిదముగా ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు, కొనుగోలు మరియు వినియోగాన్ని నివారించాలి. అటువంటి వ్యర్థాలను నీటి వనరులలో, కాలువలలో, మురుగు కాలువలలో, వీధులలో, ఖాళీ స్థలములలో మొదలైన బహిరంగ ప్రదేశాలలో విసిరేయడాన్ని నిరోధించడం అవసరం అని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *