Breaking News

స్వరాజ్య మైదానంలో జరుగు తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనుల మీద సమీక్షా సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, శనివారం కమిషనర్ బంగ్లా లో ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో కలసి వారి చాంబర్ నందు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను కమిషనర్ తెలుసుకున్నారు. ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహం తో పాటు మిగిలిన పనులు సైతం సమయంలోపు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్లు కు ఆదేశించారు. తదుపరి స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులను నేడు పలువురు అధికారులతో కలిసి పరిశీలించి విగ్రహానికి సంబంధించి డిజైన్లను ఢిల్లీ నుంచి వచ్చిన స్మృతిమనం నిర్మాణ డిజైనర్స్ తో పాటు పరిశీలించిన కమిషనర్.. డిజైనర్స్ కి ఎక్కడ ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్మాణ పనులు జరగాలని కమిషనర్ ఆదేశించారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్, కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించిన కమిషనర్. అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, నరేష్ మధురిమ ఆర్ట్స్ న్యూ ఢిల్లీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *