Breaking News

ఐటిఐ కోర్సులలో ప్రవేశానికి జూన్‌ 6వ తేది లోపు ధరఖాస్తు చేసుకోండి..

-ఐటిఐ ప్రిన్సిపల్‌ యం కనకరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ కళాశాలలో వివిధ కోర్సులలో సీట్ల కొరకు ఆసక్తిగల విద్యార్థులు జూన్‌ 6వ తేది లోపు అన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపల్‌ యం కనకరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో అందిస్తున్న వివిధ కోర్సులలో చేరేందుకు 10వ తరగతి పాస్‌ అయిన విద్యార్థుల నుండి అన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.అడ్మిషన్‌ ధరఖాస్తు చేయుటకు విజయవాడ గవర్నమెంట్‌ ఐటిఐ నందుహెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ష్ట్ర్‌్‌జూం://ఱ్‌ఱ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా అన్‌లైన్‌లో ఎటువంటి తప్పులు లేకుండా వివరాలను పూర్తి చేసి పొందుపరచాలన్నారు. ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సిలింగ్‌ నిర్వహించం జరుగుతుందని కౌన్సిలింగ్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికట్లను తప్పక తీసుకురావాల్సి వుంటుందన్నారు. ధరఖాస్తు వివరాలు సక్రమంగా లేకపోతే ప్రవేశానికి అనార్హులుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు విజయవాడ గవర్నమెంట్‌ ఐటిఐ కళాశాల నందు స్వయంగా గాని 9490639639 లేదా 7780429468 నందు సంప్రదించాలని ప్రిన్సిపల్‌ యం. కనకరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *