Breaking News

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రజలకు మరియు మహిళలకు-బాలలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు మరియుప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చర్చించేందుకు డి ఎల్ ఎస్ ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ బాలలు, మహిళల పై ఎలాంటి అరాచకాలూ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు. బాలల సంరక్షణ  కోసం నల్సా వారి “చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్” గురించి వివరించారు. ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇతరులకు ఇబ్బంది లేదా హాని కలిగే  పనులు చేయరాదని తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి, విధుల గురించి తెలియజేశారు. ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా బి.సి. వెల్ఫేర్ ఆఫీసర్ పి.ఎస్.రమేష్ వెనుకబడిన తరగతుల విద్యార్ధుల కోసం అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. డి.ఎన్.ఎం. డా. పి.లక్ష్మీ  వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సామాజిక, ఆర్థిక వెనుకబడిన  ప్రజలకు అందుబాటులో ఉన్న పెన్షన్ల , వివిధ పథకాలు గురించి వివరించారు. ఈ సదస్సులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ పి. సూర్య ప్రభావతి, రెవెన్యూ శాఖ, డి.ఆర్.డి.ఏ, మెప్మా, జిల్లా పౌర సరఫరాల శాఖ, మహిళల మరియు బాలల సంక్షేమ శాఖ, ఎస్.సి., ఎస్.టి., బి.సి. సంక్షేమ శాఖ మొదలగు శాఖల అధికారులు, వార్డు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *