అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా ముగ్గురుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ కలీం, కృష్ణా జిల్లాకు చెందిన షేక్ దిల్షాద్ నజరానా మరియు నంద్యాల జిల్లాకు చెందిన ఎస్ ముర్తజ్వలీ లను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ. ఎండి ఇమ్తియాజ్ జి.ఓ.ఆర్టి.సంఖ్య.122 ను మే 17 న జారీచేశారు. రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా వీరు పదవీ భాద్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పొందుపర్చడమైనది.
Tags amaravathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News