Breaking News

ఎన్నికల కమీషన్‌ నిర్థేశిస్తున్న విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియను సజావుగా సక్రమంగా నిర్వహించేలా ఎన్నికల కమీషన్‌ నిర్థేశిస్తున్న విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఇవోలు, ఏఆర్‌వోలు ఈఆర్‌వోలతో సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెండిరగ్‌లో ఉన్న ఫారం `6, 7, 8 క్లైయిమ్‌లు త్వరితగతిన పరిష్కరించాలని, ఎన్నికలు ఎలా నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియలో ఎలక్ట్రోరల్‌ రోల్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు, ప్లానింగ్‌, పోలింగ్‌ సిబ్బంది, నామినేషన్లు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు స్టాంర్డడ్‌ ఆపరేటివ్‌ ప్రోసిజర్‌ (ఎస్‌ఓపి)ను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. నగరంలోని కలెక్టర్‌ విడిది కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నామినేషన్‌ ప్రక్రియపై వివరిస్తూ ఎన్నికలు జరిగే సమయంలో అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలన్నారు. వీటిలో భాగంగా నామినేషన్‌ ఫారం, నామినేషన్‌ రిజిస్టర్‌, ఎలక్ట్రోరల్‌ రోల్‌, ఓత్‌ఫారాలు, ఆర్వో హ్యండ్‌బుక్‌, వివిధ ధరఖాస్తులు, ఫార్మట్స్‌లు, రిజిస్ట్రర్లు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. బౌతికంగా రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌, ఇండికేషన్‌ బోర్డు, ఫ్లెక్సీలు, ఫర్నిచర్‌, సిసిటివి, వీడియోగ్రఫీ, 100 మీటర్ల మార్కింగ్‌, కంప్యూటర్లు, సిద్దంగా ఉంచుకోవాలన్నారు. నామినేషన్లు స్వీకరించిన అనంతరం పరిశీలన తుది అభ్యర్థుల జాబిత ప్రచురణ తదితర అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, ఆర్‌డివోలు రవీంద్రరావు, వైవి ప్రసన్న లక్ష్మి, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *