-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్,
-అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి,
-చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మేరీ లైఫ్–మేరా స్వచ్ఛ షహర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. మే 20 నుండి జూన్ 5 వరకు విజయవాడ నగరంలో గల 64 వార్డులలో 15 రోజుల పాటు మేరీ లైఫ్–మేరా స్వచ్ఛ షహర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఏర్పాటు చేయడమైనది.
అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి శుక్రవారం కెనాల్ బండ్, స్క్రూ బ్రిడ్జి దగ్గర మరియు నగరంలో గల 64 వార్డులలోని స్వచ్చంద సంస్థలు, అపార్ట్మెంట్స్, స్కూల్స్, కాలేజి స్టూడెంట్స్, రెస్టారెంట్ల నిర్వాహకులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమైనారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నా జీవితం, నా పట్టణం పర్యావరణం కోసం జీవన విధానంలో భాగంగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రారంభించడం జరిగిందని, ఇందులో స్వచ్చ భారత్ మిషన్ వారు చేపట్టిన ఆర్.ఆర్.ఆర్, రెడ్యూస్ – రీసైకిల్ – రీయూజ్ ప్రక్రియకు ప్రజలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఉపయోగపడే పాత దుస్తులు, బొమ్మలు, ప్లాస్టిక్, పుస్తకాలు ఇతర వస్తువులను పెద్ద ఎత్తున సేకరించనున్నట్లు తెలిపారు.
పాత వస్తువుల సేకరణ కోసం విజయవాడ నగరంలోని 64 వార్డులలోని ముఖ్యప్రాంతాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. స్థానికంగా ఉండే ప్రజలు, సంస్థలు చైతన్యవంతులై తమ వద్ద నిరుపయోగంగా ఉండి రీసైక్లింగ్‌కు ఉపయోగపడే వస్తువులను ఆయా కేంద్రాలలో అందజేయాలన్నారు.
మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను కూడా నియమించినట్టు కమిషనర్ తెలిపారు. డివిజన్లలో ఏర్పాటు చేసిన 67 ఆర్.ఆర్.ఆర్ కేంద్రాల్లో ప్రజలు తమకు ఉపయోగపడని వస్తువులను అందించాలన్నారు. సేకరించిన వస్తువులను ఆయా కేంధ్రాల వద్దనే ఉపయోగపడేవారికి అందివ్వడం జరుగుతుందని, మిగిలిన వస్తువులను తుకివాకం డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి పునర్వినియోగంకి తీసుకిరావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ కోరారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, సచివాలయం సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News