-ఈ రైలు ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన మరియు ప్రసిద్ధ యాత్రా స్థలాలను కలుపుతుంది.
-ఇది ఐ ఆర్ సి టి సి చే నిర్వహించబడుతుంది .తెలంగాణ మరియు మహారాష్ట్రలోని నిర్దేశించిన స్టేషన్లలో ప్రయాణీకులకు ఎక్కేందుకు /దిగే సౌకర్యాన్ని అందిస్తుంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ‘భారత్ గౌరవ్’ రైలు ఉద్దేశం గొప్ప విజయాన్ని సాధించింది. ఇది కాశీ & పరిసర ప్రాంతాలకు ఇటీవలి ట్రిప్పుల స్థిరమైన 100% ఆకుపెన్సీతో ప్రయాణికుల నుండి మంచి ప్రోత్సాహం అందింది . రైలు ప్రయాణీకుల నుండి అనుకోనిరీతిలో విశేషమైన స్పందనతో రావడం వలన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐ ఆర్ సి టి సి ) భారతదేశంలోని ఇతర ప్రసిద్ధ మరియు ముఖ్యమైన యాత్రా స్థలాలను కవర్ చేసే భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణ కోసం కొత్త టూరిస్ట్ సర్క్యూట్‌ను ప్రణాళిక రూపొందించింది .
ఇందులో భాగంగా, ఐ ఆర్ సి టి సి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే “మాతా వశిహ్నో దేవి, హరిద్వార్ మరియు రిషికేశ్” భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అనే కొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఈ రైలు , దేశంలోని ఉత్తర భాగంలోని ముఖ్యమైన యాత్రికులు మరియు చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది .తెలంగాణ మరియు మహారాష్ట్రలోని ఏడు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కేందుకు / దిగే సౌకర్యాన్ని కల్పించింది .
“హరిద్వార్ & రిషికేశ్‌తో మాతా వైష్ణోదేవి” ప్రయాణించే ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, రామగుండం మరియు సిర్పూర్ ఖగజ్‌నగర్‌లతో పాటు మహారాష్ట్రలోని బల్హర్షా, వార్ధా మరియు నాగ్‌పూర్‌లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎక్కేందుకు / దిగే సౌకర్యాన్ని కల్పించింది . ఈ రైలు కత్రా, ఆగ్రా, మధుర, బృందావన్, కత్రా, హరిద్వార్ మరియు రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తుంది. వైష్ణో దేవి ఆలయం కోసం కాట్రా నుంచి ఆలయానికి వెళ్లాలనుకునే పర్యాటకులు పోనీ / డోలీ / హెలికాప్టర్ సర్వీస్ ద్వారా తమ వ్యక్తిగతముగా వారే బుక్ చేసుకోవాలి.
మొత్తం ట్రిప్ 8 రాత్రులు / 9 పగల్లు కాల వ్యవధిలో కవర్ చేయబడుతుంది. ప్రయాణీకులకు తగిన రైళ్లు, వసతి, ఆహారం మొదలైన అన్ని సంబంధిత ఏర్పాట్లు చేయడం మరియు వ్యక్తిగతంగా ప్లాన్ చేయడంలో ఉన్న అన్ని ఇబ్బందులను నివారించి ఈ రైలు మంచి సౌకర్యం వసతులను పర్యాటకులకు కల్పిస్తుంది .. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ – ఆన్-బోర్డ్ మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), ప్రొఫెషనల్ మరియు ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్‌ల సేవలు, భద్రత రైలులో (అన్ని కోచ్‌లలో అమర్చిన సి సి టి వి కెమెరాలతో సహా), అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా మరియు సహాయం కోసం ప్రయాణం అంతటా ఐ ఆర్ సి టి సి టూర్ మేనేజర్‌ల పర్యవేక్షణలో అందించడం జరుగుతుంది .
మరిన్ని వివరాల కోసం ఐ ఆర్ సి టి సి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: http://www.irctctourism.com బుకింగ్ లింక్‌తో: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG05 మరియు సికింద్రాబాద్ ఆఫీస్ ఫోన్ నంబర్‌లలో కూడా సంప్రదించవచ్చు: 9701360701, 8287932228, 9110712752
Prajavartha Online Telugu News