Breaking News

నిరుపయోగ వస్తువులను రీ సైక్లింగ్ ప్రక్రియ కోసం అందించండి

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 16 వ డివిజన్ పోలీసు కాలనీ ప్రాంగణంలో ఆర్.ఆర్.ఆర్ ( రెడ్యూస్ – రీ యూజ్ – రీ సైకిల్ ) కేంద్రాన్ని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారితో కలిసి డిప్యూటీ మేయర్  బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహాలలో వాడకంలో లేని నిరుపయోగ ప్లాస్టిక్, పాత పుస్తకాలు, దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్.ఆర్.ఆర్ కేంద్రాల్లో అందజేస్తే, రీ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ప్రకృతికి అనుగుణంగా వాటిని పునరుత్పాదన చేయగలమని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ వెల్లడించారు. నగర వ్యాప్తంగా చెత్త ఉత్పత్తిని తగ్గించేందుకు విజయవాడ నగరంలోని 64 వార్డులలోని ముఖ్యప్రాంతాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్.ఆర్.ఆర్ కేంద్రాల ద్వారా ప్రధానంగా “రెడ్యూస్ – చెత్త ఉత్పత్తి అవసరాలను వీలయినంత తగ్గించడం. రీ యూజ్ – చెత్త ఉత్పత్తికి కారణమయ్యే వస్తువులను వాటి కాలపరిమితి పూర్తయ్యే వరకు పదే పదే వినియోగించడం. రీ సైకిల్ – పూర్తి కాలపరిమితి దాటేంత వరకు వాడిన వస్తువులను పునరుత్పాదన చేయడం” వంటి చర్యలను నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు. పునరుత్పాదన చేయగల వస్తువులను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఆర్.ఆర్.ఆర్ కేంద్రాలకు అందించాలని, సేకరించిన వస్తువులలో ఉపయోగించదగిన వాటిని అవసరమైన ప్రజలకు ఉచితంగా అందిస్తామని కమిషనర్ తెలిపారు. రీ సైక్లింగ్ చేయగలిగిన అన్ని వస్తువులనూ పునరుత్పాదక కేంద్రాలను పంపించి నగరంలో వ్యర్ధాలను తగ్గించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్  బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, జోనల్ కమిషనర్-3 ఎం. క్రిష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ శకుంతల, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్, స్వయం సహాయక సంఘ సభ్యులు, సచివాలయాల శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *