Breaking News

కృష్ణలంక సమీపంలోని అంబేద్కర్ పార్కు పరిశీలన

-పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ శనివారం అధికారులతో కలిసి కృష్ణలంక జాతీయ రహదారి ప్రక్కన గల అంబేద్కర్ పార్కును క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పార్కులో జరుగుతున్నవంటివి పునరుద్ధరికరణ పనులను మరియు గ్రీనరీ పరిశీలించినారు. విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అంబేద్కర్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని, పార్క్ లో చిన్నారుల నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని అందించేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పార్క్ లో ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాటు చేయనున్న కళాకృతులను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. వెంటనే నిర్దేశిత గడువు మేరకు కాంట్రాక్టర్ లు చేసేలా, అవసరమైతే షిఫ్ట్ ల వారిగా పనులు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెంపు పై ఏ.డి.హెచ్. మరింత దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా కెనాల్ బండ్ లోకి దిగకుండా ఏర్పాటు చేస్తున పెన్సింగ్ ను పరిశీలించి వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకొని మిగిలిన పనిని త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా అధికారులకు ఆదేశించడమైనది. ఈ పర్యటనలో ఏ.డి.హెచ్ శ్రీనివాసు శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *