Breaking News

పర్యావరణ పరిరక్షణకు ప్రజల జీవన శైలిలో మార్పు రావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేరీ లైఫ్‌ – మేరా స్వచ్చ షహార్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌ రీసైకిల్‌ రియూజ్‌) వాహనం ద్వారా సేకరించిన వ్యర్థలను పునర్వినియోగంతో పాటు ఉపయోగంలోనికి తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు తెలిపారు.
ప్రపంచ పర్యావరణాన్ని పురస్కరించుకుని మేరీ లైఫ్‌ – మేరా స్వచ్చ షహార్‌ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌ రీసైకిల్‌ రియూజ్‌) వాహనాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు శనివారం ఆయన విడిది కార్యాలయం వద్ద ప్రారంభించి ఆయన గృహాంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను మున్సిపల్‌ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రజల జీవన శైలిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ట్‌ వాడకాన్ని తగ్గించిన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసినవారమవుతామన్నారు. ప్రజలు వద్ద నున్న వ్యర్థాలను సేకరించి వాటిలో పునర్వినియోగానికి పనికి వచ్చే వాటిని ఉపయోగంలోనికి తీసుకురావడం పనికి రాని వ్యర్థాలను డంపింగ్‌ యార్డ్‌కు తరలించడం జరుగుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ పద్దతిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. తక్కువ వినియోగం (రెడ్యూస్‌) పునర్వినియోగం (రియూజ్‌) శుద్ది చేసి వినియోగం (రీసైకిల్‌) విధానాలు వ్యర్థాల నివారణకు స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారానే సురక్షితమైన త్రాగు నీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి ప్రజలకు అందుతాయన్నారు. పర్యావరణం దెబ్బతినడం వలన వాతావరణంలో పెనుమార్పులను ఎదుర్కొవలసి వుస్తుందన్నారు.ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలలో ముఖ్యంగా ఉపయోగించని, పాడైన కంప్యూటర్స్‌, సెల్‌ఫోన్లు, సిడిలు, బ్యాటరీలు, ఎల్‌ఇడి బల్బులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని కలెక్టర్‌ అన్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాటిని ప్రత్యేకంగా సేకరించేందుకు కలక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్‌ రంగంలోని కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి ప్రోసెస్‌ చేస్తున్న విధానాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా అమలు చేసే విధంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్‌ అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే విధంగా ప్రజలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
నగరపాలక సంస్థ మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌ మాట్లాడుతూ మేరీ లైఫ్‌ – మేరా స్వచ్చ షహార్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌ రీసైకిల్‌ రియూజ్‌) కార్యక్రమాన్ని నిర్వహించి పర్యవరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో 67 ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి మే 20వ తేది నుండి జూన్‌ 5వ తేది వరకు ఉదయం 7:00 గంటల నుండి మధ్యహ్నం 1:00 గంట వరకు ప్రజల వద్ద నిరుపయోగంలో ఉన్న వస్తువులను సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల వద్ద ఆర్థిక మొత్తంలో నిరుపయోగంలో ఉన్న పాత పుస్తకాలు, పాత దుస్తువులు, పాత షూస్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పూల వ్యర్థలు, ఎలక్ట్రానిక్‌, వస్తువులు ఉన్నట్లైయితే 8181960909 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ఇంటివద్దకే ఆర్‌ఆర్‌ఆర్‌ వాహనాన్ని పంపి నిరుపయోగంలో ఉన్న వస్తువులను సేకరించడం జరుగుతుందన్నారు. సేకరించిన వాటిలో ఉపయోగపడే వస్తువులను స్వచ్చంద సంస్థల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమీషనర్‌ అన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌ వాహన ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు యండి రుహుల్లా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు అవుతూ శ్రీ శైలజారెడ్డి , బెల్లం దుర్గ, సబ్‌ కలెక్టర్‌ అదితి సంగ్‌, నగరపాలక సంస్థ డిప్యూటి కమీషనర్‌ సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *