Breaking News

పదవ తరగతి పాసైన వారికీ ఐటిఐ లో షర్ట్ టర్మ్ కోర్స్లు.

-ఐటిఐ ప్రిన్సిపల్ యం. కనకారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పాసైన విద్యార్థులకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో స్వల్ప కాలిక కోర్సులలో అవకాశం కల్పించేందుకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ యం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఎలిక్ట్రిషియన్, డొమెస్టిక్ సోలుషన్స్ మరియు ప్లంబ్బర్ జనరల్ కోర్సులను స్వల్ప కాలిక ప్రాతిపదికన అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. 4 నెలల పాటు శిక్షణ అందించే స్వల్ప కాలిక కోర్సులను పూర్తీ చేసుకున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వారిచే సర్టిఫికెట్ మంజూరు చేయడం జరుగుతుందని కోర్సును అభ్యసించే సమయంలో విద్యార్ధ్యులకు బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. షర్ట్ టర్మ్ కోర్సులో చేరేందుకు ఆసక్తి కలిగి పదవ తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు విజయవాడ గవర్నమెంట్ ఐటిఐ కార్యాలయం నందు స్వయంగా గాని, 0866 2475575 లేదా 9963040678/9951281278 నందు సంప్రదించాలని యం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *