-బ్యాంకులు రుణాలు మంజూరు చేసి మహిళలకు ఆర్థిక పరిపుష్టిని కల్పించాలి.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపార పారిశ్రామిక రంగాలలో కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని బ్యాంకులు రుణాలను మంజూరు చేసి మహిళలకు ఆర్థిక పరిపుష్టిని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపార పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించేందుకు శనివారం గొల్లపూడిలోని టిటిడిసి భవనంలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమ యంత్రా సామాగ్రి ప్రదర్శనలు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆర్ధిక పురోభివృద్దికి బాటలు వేసుకోవాన్నారు. ఇటీవల సామాజపరంగా వస్తున్న మార్పులను గమనించి అనుగుణంగా వ్యాపార అవకాశలపై దృస్టి పెట్టాలన్నారు. ఆహారపు ఆలవాట్లు జీవన శైలి, సాంకేతికంగా వస్తున్న మార్పులు వ్యాపార అవకాశాలకు దోహదపడతాయాన్నారు. జిల్లాలో సుమారు 23 వేల స్వయం సహాయక బృందాలలో 2లక్షల 35 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. వీరికి ఆర్థిక సహకారం అందించి సమాజంలో ఉన్నత స్థాయిని కల్పించేలా వ్యాపార రంగాలలో అవకాశాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా కారం, పిండి మిషన్లు, చాపాతి తయారీ మిషన్లు, ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు, ఉద్యాన పంటాలకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆదునీక యంత్రపరికరాలను సంబంధించిన వ్యాపారలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు మహిళలకు సూచించారు. యంత్రా పరికరాల కొనుగోలుకు అవసరమైన పెట్టుబడికి ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీకి తోడు బ్యాంకులు అవసరమైన రుణాలను మంజూరు చేసి మహిళలను పారిశ్రామిక రంగంవైపు ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఐఎస్‌ఎస్ మూర్తి,ఇండియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ మల్లికార్జున్‌రావు, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ కె. సుబాణి, ఎల్‌డిఎం ప్రియంక, కెనాడ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అధికారులు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు సీత, వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నాగమణమ్మ, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌రావు, జిల్లాకు చెందిన డిపియం, ఎపియంలు, మండల సమైఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News