-ప్రతి పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
-కిడ్నీ వ్యాధి బాధితులకు మెరుగైన వైద్య చికిత్స.
-వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టి అత్యాధునిక మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రతి పేద వానికి కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులను అందజేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని.
తెలిపారు.
ఎ కొండూరు మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కిడ్నీ రోగులకు ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల ఆరోగ్యం పట్ల ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఎ కొండూరు ప్రాంతంలో గిరిజన తండాలకు చెందిన ప్రజలు కిడ్నీ వ్యాధి భారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గిరిజనులు అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు వారి పట్ల నిర్లక్ష్యం చూపాయన్నారు. కిడ్నీ బాధితుల భాధలను గుర్తించి సమస్యకు గల కారణాలను గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. కిడ్నీ వ్యాధికి ఈ ప్రాంతంలో లోని భూ గర్భ జలలో ఫ్లోరిన్ ఎక్కువ శాతం ఉండటం కారణమని నిర్ధారణకు రావడంతో ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కృష్ణా జలాలను తండా ప్రజలకు సరఫరా చేసేందుకు రక్షిత మంచినీటి పథకానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కళాశాల అయినా ఉండాల్సిందేననే లక్ష్యంతో ఏకంగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి రూ. 2500 కోట్ల ఖర్చుతో 750 మెడికల్ సీట్లతో 5 కాలేజీ లలో అడ్మిషన్స్ ప్రారంభించనున్నామని ఆగష్టు నుండి క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమేనన్నారు. జబ్బుల వల్ల ఏ కుటుంబం కూడా ఆర్థికంగా చితికి పోకూడదనే లక్ష్యంంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం ప్రజలకు అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ అనే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్ధాయిలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తరువాత ఆచరణలో పెట్టడం జరిగిందన్నారు. కిడ్నీ పేషంట్లకు నెలకు రూ.10వేల పింఛను అందించడమే కాకుండా ఉచితంగా మందులు, డయాలసిస్ సౌకర్యం కల్పిస్తూ పింఛనును, నెఫ్రాలజిస్ట్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె.నివాస్ మాట్లాడుతూ పి.హెచ్.సిలో పరీక్షలు నిర్వహిస్తారని, పరీక్షలో ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులు సూచించిన విధంగా మందులు తీసుకొని వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చన్నారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వలన వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.
జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు మాట్లాడుతూ ఎ కొండూరు ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎ కొండూరు తండా వాసులకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మరో 2 కోట్ల రూపాయలతో మైలవరం నుండి కృష్ణ జలాల సరఫరాకు పైపు లైనుల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. తండా ప్రజలకే కాకుండా మండలానికి చెందిన ప్రజలందరికీ రక్షిత మంచి నీటి సరఫరా చేసేందుకు ముఖ్యంమత్రి హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిడ్నీ వ్యాధిని సమూలంగా రూపుమాపి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కొక్కిలి గడ్డ రక్షణ నిధి, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఎస్. వెంకటేశ్వరరెడ్డి, ఏపీఎంయస్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.వి. రామిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డా. యం. సుహాసిని, డిసిహెచ్ఎస్. డా.జి. స్వప్న, ఎ కొండూరు మండల ఎంపిపి కె. నాగలక్ష్మి, జెడ్ పిటిసి భూక్యా గన్యా, ఎంపిటిసిలు యస్. పద్మ, భూక్యా సోమేశ్వరి, గ్రామ సర్పంచ్ వెంపటి రజిని, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News