Breaking News

విజయవంతంగా స్ఫూర్తి కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యాన రాధా శ్యామసుందరుల మందిరమున ఈ నెల 20, 21 న జరిగిన స్ఫూర్తి కార్యక్రమము విజయవంతముగా ముగిసింది. యువతను ఉద్దేశించిన ఈ కార్య క్రమమునకు IIT hyderabad, BITS Pilani, Srinidhi college, CBIIT, NIIT warangal, SV college Tirupathi మరియు అనేక corporate సంస్ధల నుండి 130 మంది హాజరయ్యారు. ఈ కార్య క్రమమునకు ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీమన్ రాధేశ్యమ్ ప్రభు యువతను ఉధ్ధేశించి ప్రసంగించటం ప్రధాన ఆకర్షణగా నిలచినది. ఈ రెండు రోజుల కార్య క్రమములో భగవద్గీత ఆధారముగా అనేక ఉపన్యాసములు, నాటికలు, ప్రజంటేషన్స, డిబేట్సు నిర్వహించారు. యువత ప్రతిరోజు హరేకృష్ణ మంత్రము జపించుటయే కాక శ్రీ శ్రీ పానకాల స్వామిని దర్శించి మధురమైన అనుభూతిని పొందినట్లు వ్యక్తపరిచారు. ఈ సంధర్బమున మందిర అధ్యక్షులు శ్రీమన్ చక్రధారి ప్రభుజి మాట్లాడుతూ, ఈ కార్య క్రమమునకు హజరయిన యువత ఆదర్శ ప్రాయమైన జీవితము గడిపెదమని, చెడు వ్యసనములు దరిచేరనీయమని, ప్రతిరోజు హరేకృష్ణ మహా మంత్రమును జపించెదమని ప్రమాణము చేయుట జరిగినదని తెలిపి, చివరిగా ఈ కార్య క్రమమునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *