Breaking News

యూనియన్‌ బ్యాంకు సేవలు ప్రశంసనీయం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అధికారులు మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావును మార్యదపూర్వకంగా కలిసారు. విజయవాడ యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నూతన ప్రాంతీయ ఉన్నతాధికారి మువ్వ శ్రీధర్‌, డిప్యూటి ప్రాంతీయ అధికారి ఐఎస్‌ఎస్‌ మూర్తి, ఎల్‌డియం ప్రియాంక, జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ పథకాలకు అదిక బ్యాంకు రుణాలు అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎంతో సహకరిస్తుందన్నారు. స్వయం సహాయ సంఘాలు, టిడ్కో బుణాలను 50 శాతం కంటే ఎక్కువగా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్‌ డిల్లీరావు అభినందిస్తు రాబోయే రోజులలో ప్రభుత్వ పథకాలకు రుణ సహాయాన్ని అందజేసి పేదరిక నిర్మూలన, ప్రభుత్వ ఆశయానికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *