-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును మార్యదపూర్వకంగా కలిసారు. విజయవాడ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నూతన ప్రాంతీయ ఉన్నతాధికారి మువ్వ శ్రీధర్, డిప్యూటి ప్రాంతీయ అధికారి ఐఎస్ఎస్ మూర్తి, ఎల్డియం ప్రియాంక, జిల్లా కలెక్టర్ డిల్లీరావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రభుత్వ పథకాలకు అదిక బ్యాంకు రుణాలు అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎంతో సహకరిస్తుందన్నారు. స్వయం సహాయ సంఘాలు, టిడ్కో బుణాలను 50 శాతం కంటే ఎక్కువగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్ డిల్లీరావు అభినందిస్తు రాబోయే రోజులలో ప్రభుత్వ పథకాలకు రుణ సహాయాన్ని అందజేసి పేదరిక నిర్మూలన, ప్రభుత్వ ఆశయానికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
Prajavartha Online Telugu News