-‘స్కిజోఫ్రెనియా’పై అప్రమత్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కిజోఫ్రెనియా వ్యాధిపై ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండి చికిత్స పొందాలని మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్ అధినేత డా.ఆయోధ్య ఆర్.కె, చైల్డ్-ఎడల్డ్ సైకియాట్రిస్ట్ డా. మానస కాజ తెలిపారు. ప్రపంచ స్కిజోఫ్రెనియా ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై స్కిజోఫ్రెనియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈనెల 20వ తేదీ నుంచి 27 వరకు వారం రోజులపాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) నిర్ణయించిందన్నారు. 24వ తేదీన ప్రపంచ స్కిజోఫ్రెనియా ఆరోగ్య దినంగా గుర్తించబడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 0.3 నుండి 0.7 శాతం ప్రజలు జీవిత కాలంలో స్కిజోఫ్రెనియా వ్యాధి పీడితులేనన్నారు. ఈ వ్యాధిగ్రస్తులు నలుగురిలో కలవలేకపోవడం, పనిమీద ధ్యాస తగ్గిపోవడం, గొణుగుడు, ఒంటరి జీవితం, నాన్ ప్రొడక్టివ్‌గా తయారైపోతుంటారన్నారు. స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడేవారికి ”యాంటి సైకోటిక్స్” అనే మందులు వాడడం ఉత్తమమన్నారు. తొలుత వ్యాధి పట్ల రోగికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన (సైకో ఎడ్యుకేషన్). కల్పించాల్సి వుంటుందన్నారు. దీన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటారు. వ్యాధిగ్రస్తులు ఇన్ పేషెంట్‌గా ఉండి వ్యాధి కొంత నయం అయిన ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. అనంతరం ఇంటికి వెళ్ళి తరువాత బయాబెటిస్, బి. పి. వంటి దీర్ఘకాల మందులు ఏవిధంగా వాడుతుంటారో వీరికి కుడా అలానే వాడవలసి ఉంటుందన్నారు.
Prajavartha Online Telugu News