Breaking News

స్వచ్ఛత పఖ్వాడ – శుభ్రత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ లో భాగంగా స్వచ్ఛత పఖ్వాడ – శుభ్రత అనేది సేవ కింద “రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ – విజయవాడ” వారి తరపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా 315 డస్ట్ బిన్ లను మరియు కౌమారదశ ఆడపిల్లల పర్సనల్ హైజీన్ కు సంబంధించి 500 IEC మెటీరియల్ ను ఆ సంస్థకు సంబంధించిన చీప్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్. జయంతి, డిప్యూటీ మేనేజర్ కృష్ణ చైతన్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ ముత్తు రామకృష్ణ మరియు సోనీ గోపిక ప్రసాద్  విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయములో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) చాంబర్ నందు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే. వి సత్యవతి కి అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్)  మాట్లాడుతూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తరపున ఇవి అందజేయడమే కాకుండా భవిష్యత్తులో సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా తమ సహకారం ఉంటుందని ఆ సంస్థ తెలిపిందని అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు చేసే సంస్థలతో కలిసి విజయవాడ నగర పాలక సంస్థ, విజయవాడ నగర అభివృద్ధికి తోడ్పడుతుందని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *