తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి చే సచివాలయ ఉద్యోగుల కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష ఈ నెల తేది 26, 27 న పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు సూచించారు. గురువారం ఉదయం స్థానిక డి ఆర్ ఓ చాంబర్ నందు ఎపిపిఎస్సి సచివాలయ ఉద్యోగుల కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లాలో కారుణ్య నియామకంలో సచివాలయాల్లో పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 5, వి.ఆర్.ఓ. గ్రేడ్ 1 మరియు 2 , మరియు సీనియర్ సహాయకులకు ఉద్యోగుల కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష నిర్వహణ ఉంటుందని అన్నారు. పరిక్షా కేంద్రం ఎస్.ఎస్.డిజిటల్ ఈ నెల 26 న నాలుగు సిప్ట్ లలో 480 మంది , ఈ నెల 27 న మూడు సిప్ట్ లలో 347 మంది ఆన్ లైన్ పరీక్ష వ్రాయనున్నారని పోలిస్ బందోబస్త్ , విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఆర్ టి సి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో ఈ సమీక్షలో ఎపిపిఎస్సి సెక్షన్ ఆఫీసర్ నవ్యజ్యోతి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నాగజ్యోతి , ఎస్.ఎస్.డిజిటల్ శ్రీధర్ , ఎస్.బి. చంద్ర శేఖర్ , ఆర్ టి సి డి.ఆర్.నాయుడు , ఎస్.పి.డిసి ఎల్ గణపతి , డిటిలు చెంచయ్య, యుగంధర్ , అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News