Breaking News

ఎన్ సి డి సర్వేలో గుర్తించిన వ్యాధులకు ఇంటింటి వైద్యం ద్వారా మందులు అందించాలి

-నాడు నేడు పనులను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్

తిరుపతి, మే 25:
వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఎన్సీడీ సర్వేలు గుర్తించిన హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇతర వ్యాధులకు తప్పనిసరిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఇంటింటి వైద్యం )ద్వారా ప్రతినెల వారికి మందులను ఉచితంగా అందించాల్సి ఉంటుందని అలాగే పాఠశాలల ప్రారంభం నాటికి నాడు నేడు లో ప్రాధాన్యతా పనులు పూర్తి చేయాలని జగనన్న విద్యా కానుక పంపిణీకి సిద్ధంగా ఉంచాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సూచించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ.. నాన్ కమ్యూనల్ డిసీజెస్ సర్వే సమయంలో గుర్తించిన గ్రామీణ ప్రాంత ప్రజలకు నెలవారి మందులు తప్పనిసరిగా ఉచితంగా అందించాల్సి ఉంటుందని అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా 104 వాహన పర్యటనలు వారికి పరీక్షలు నిర్వహించి వైద్య సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వాహనం నెలలో రెండుసార్లు తప్పనిసరి సచివాలయాలను పర్యటించాలని దూరమైన హేబిటేషన్లను కూడా కవర్ చేసే విధంగా ఒకసారి ఒకచోట మరొకసారి మరొక హేబిటేషన్ లో నిర్వహించే విధంగా చూడాలని అన్నారు. కంటి వెలుగు కు సంబంధించి పరీక్షలు వేగవంతం చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అలాగే కంటి అద్దాల పంపిణీ చూడాల్సి ఉంటుందని సూచించారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేసుకున్న వారి కుటుంబాల వద్దకు వెళ్లి ఏఎన్ఎంలు వారి వద్ద స్పందన సేకరించాలని వాటిని తప్పనిసరిగా ఏఎన్ఎం యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు గర్భవతులకు సంబంధించి బర్త్ ప్లానింగ్ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల వద్ద ఉండాలని ఆ మేరకు ఆసుపత్రులకు సరైన సమయానికి వెళ్లే విధంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుందని అన్నారు.
పాఠశాలలు జూన్ 12న ప్రారంభం కానున్నాయని నాడు నేడు పనులకు సంబంధించి మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్తు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని అన్నారు జగనన్న విద్యా కానుకకు సంబంధించి వస్తువులు జిల్లాకు అందుతున్నాయని వాటిని మండల కేంద్రాలలో భద్రపరిచి, ప్రజలు, ప్రజా ప్రతినిధులు వాటి నాణ్యతను పరిశీలించే విధంగా నిర్వహణ జరపాలని అన్నారు. ప్రత్యేకంగా జగనన్న విద్యా కానుక కిట్ రూపంలో తయారుచేసి మండల కేంద్రాల నుండి పాఠశాల ప్రారంభానికి ముందుగా చేరుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని సూచించారు. బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి పాటశాలల్లో చేర్పించడం చూడాలని అన్నారు. ఆసక్తి చూపని పిల్లలకు తప్పనిసరి స్కిల్ డెవెలప్ మెంట్ లో శిక్షణ ఇప్పించాలని అన్నారు.
జగనన్నకు చెబుదాం 1902 కాల్ సెంటర్ , అలాగే స్పందన కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, ప్రతిరోజు అధికారులు తమ లాగిన్ ను రెండుసార్లు పరిశీలించి వినతులకు పరిష్కారం చూపించాల్సి ఉంటుందని అన్నారు. వీటికి సంబంధించి సీఎంవో , సిఎస్ కార్యాలయాలలు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రజల సమస్యలను మనం వెంటనే పరిష్కరించే విధంగా చూడాల్సి ఉంటుందని అన్నారు.
ఈ సమీక్షలో జిల్లా ప్రణాళిక అధికారి అశోక్ కుమార్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు సుశీలదేవి, ఆదిశేషరెడ్డి అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ అరుణ సులోచనా దేవి, డాక్టర్లు,ఐ సి డి ఎస్ పి డి జయలక్ష్మి ,ఎస్సీ వెల్ఫేర్ అధికారి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *