Breaking News

రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతుల భూముల విస్తీర్ణంకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి.

-రెండవ ఫేజ్ గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: సి.సి.ఎల్.ఏ. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సాయిప్రసాద్
-జిల్లాలో హద్దు రాళ్ళు నాటే ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలి: ఇంఛార్జి జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాలలో రైతుల విస్తీర్ణంకు సంబంధించిన వివరాల డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ. కార్యాలయం నుండి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సర్వే రాళ్లు నాటే ప్రక్రియ, జగనన్నకు చెబుదాం, గ్రౌండ్ ట్రూతింగ్, విలేజ్ సర్వే వివరాల డేటా ఎంట్రీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్లో రైతుల విస్తీర్ణం కు సంబంధించిన ఖాతా, ఆధార్, సర్వే నంబర్ కు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని తెలిపారు. సర్వే రాళ్ళు నాటే ప్రక్రియ ను లక్ష్యం మేరకు వేగవంతం చేయాలని అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం లో వచ్చే అర్జీలు ఎక్కువగా రెవెన్యూకు సంబంధించినవి అని వాటిని అర్జీదారుల సంతృప్త స్థాయిలో పూర్తిచేయాలని తెలిపారు.

వీడియో కన్ఫెరెన్స్ అనంతరం ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ సంబందిత అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతుల భూమి విస్తీర్ణంకు సంబంధించిన 291 గ్రామాల రైతుల భూముల డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. మొదటి దశ సర్వే రాళ్లు నాటే ప్రక్రియ 69 గ్రామాలలో పూర్తయిందని, రెండవ దశ లో సర్వే రాళ్లు నాటే ప్రక్రియ 12 గ్రామాలకు గాను 3 గ్రామాలలో పూర్తి కాగా మిగిలిన గ్రామాలలో నిర్దేశించిన గడువులోపు సర్వే రాళ్లు నాటే ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *