Breaking News

పేదలందరికీ ఇళ్లు- జగనన్న లే అవుట్లకు మట్టి ఇటుకలను సిమెంట్ రాళ్ళను ఇటుక బట్టీల యాజమాన్యాలు అందుబాటు ధరకు సరఫరా చేయండి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ ఇళ్లు- జగనన్న లే అవుట్ల లో నిర్మితమవుతున్న గృహాలకు మట్టి ఇటుకలను, సిమెంట్ రాళ్ళను అందుబాటు ధరకు సరఫరా చేయాలని ఇటుక బట్టీల యజమానులను ఆదేశించారు.

గురువారం మధ్యాహ్నం పేదలందరికీ ఇళ్లు జగనన్న కాలనీ లే అవుట్ లలో నిర్మితమవుతున్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయటానికి సరిపడా మట్టి ఇటుకలు, సిమెంట్ రాళ్ళను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ తిరుపతి శ్రీకాళహస్తి వారితో పాటు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి వడమల పేట, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, మరియు ఏర్పేడు మండలాల తాసిల్దారులతో, ఇటుక బట్టేల యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పేదలకు ఇంటి నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర సంక్షేమ కార్యక్రమంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల రూపాయలకు అదనంగా ఎస్ హెచ్ జి రుణాలు అందించి ఇల్లు పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఇటుక బట్టీల యజమానులు సహృదయంతో పేదల ఇంటి నిర్మాణానికి అందుబాటు సరసమైన ధరలలో మట్టి ఇటుకలను, సిమెంట్ రాళ్లను అందించాలని తెలిపారు. ఇటుక బట్టీల యాజమాన్యాలు వారి సమస్యలు తెలుపగా ఇసుక అందుబాటు రీచ్ ల నుండి పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి సక్రమంగా అందేలా,సిమెంట్ రాళ్ళు అందుబాటులో ఉండేలా సదరు రెవెన్యూ, ఈఓ పిఆర్డి, పంచాయతీ కార్యదర్శులు మైనింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.అక్కడే సమావేశంలో ఉన్న తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీవోలను తాసిల్దార్లను టోకెన్ల ద్వారా మట్టి, సిమెంట్ రాయిని పై కార్యక్రమానికి ఇటుక బట్టీల యజమానులు తోలుకొనుటకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. చిందేపల్లి, సూరప్పకాశం, జి పాలెం, ఎం.కొత్తపల్లి, కల్లూరు తదితర లేఔట్లలో ఇటుక సరఫరా నిర్దేశించిన రేటు ప్రకారం సరఫరా చేయాలని ఇటుక బట్టీల యజమానులను ఆదేశించారు.

జగనన్న కాలనీ లేఅవుట్ లలో వివిధ స్టేజీలలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావడానికి మట్టి ఇటుకలు, సిమెంట్ రాళ్ళ తగినన్ని అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేఅవుట్ కు ఎన్ని అవసరం అవుతాయి అనేది ముందుగా అంచనా వేసుకుని వాటిని సరిపడా అందుబాటులో ఉండేలా చూడాలని అందుకొరకు లేఔట్ సమీపంలో ఇటుక బట్టీ ఏర్పాటుతో వర్షాకాలం ప్రారంభంలోపు ఇళ్ల నిర్మాణాలు చాలావరకు స్టేజి కన్వర్షన్లు జరిగేలా మరియు పూర్తిస్థాయిలో ప్రారంభానికి ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత లేఔట్ ఇన్చార్జిలను, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంబంధిత ఆర్డీవోలు గృహ నిర్మాణాలపై సమీక్ష చేస్తూ స్థానికంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమ ఇంటి నిర్మాణానికి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని, జూలై చివరి నాటికి గౌ. ముఖ్యమంత్రి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్య నిర్దేశం మేరకు అందిపుచ్చుకుని ప్రణాళికా బద్ధంగా పని చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కనక నరసారెడ్డి రామారావు హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఇంజనీర్లు లే అవుట్ ఇన్చార్జిలు, తాసిల్దారులు ఇటుక బట్టీల యాజమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *