Breaking News

విశ్వకర్మ నేషనల్ సమ్మిట్ మరియు విశ్వకర్మ లెజెండరీ అవార్డ్స్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ 7వ వార్షికోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 28 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహిస్తున్న విశ్వకర్మ నేషనల్ సమ్మిట్ మరియు విశ్వకర్మ లెజెండరీ అవార్డ్స్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల విస్తరించి ఉన్న విశ్వబ్రాహ్మణ జాతీయలు వేలాదిగా ఈ విచ్చేసి జయప్రదం చేయాలని ఆంద్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలియజేసారు.ఈ కార్యక్రమానికి సుమారు పది రాష్ట్రాల నుండి ఆయా రంగాల్లో నిష్ణాతులైన విశ్వకర్మలు విచ్చేస్తారని ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన విశ్వకర్మలకి దాదాపు 100 మందికి విశ్వకర్మ లెజెండరీ అవార్డ్స్ అందజేస్తామని తెలియజేశారు. విశ్వబ్రాహ్మణ పంచకర్మలు, సాహిత్య సాంస్కృతిక వేద విద్య వైదిక ఆగమ శాస్త్రాల్లో నిష్ణాతులైన అనేకమంది విశ్వకర్మలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తేంద్ర పారంపర్య పీఠాధిపతులు, నందికొండ సంస్థానాధీశులు శ్రీకాంతేంద్ర స్వాముల వారి అనుగ్రహ భాషణం ఉంటుందని, ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. రుంజ శబ్ద విన్యాసము శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంక్షిప్త నాటక ప్రదర్శన మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకులు విశ్వనాధుల పుష్పగిరి మాట్లాడుతూ ప్రపంచీకరణ మత్తులో మనం మూల సంస్కృతిని కోల్పోతున్న తరుణంలో విశ్వకర్మ సమాజపు సంస్కృతి సంప్రదాయాలు కాపాడేందుకు కృషి చేయడం. విశ్వకర్మ సమాజం సృష్టి ఆది నుంచి మానవ మనుగడకు ప్రతి సందర్భంలో వెన్నుముక గా నిలిచింది. నాగరికతకు మూలస్తంభంగా సమస్త ఉత్పత్తి నిలబడితే సృజనాత్మకతతో ఆ ఉత్పత్తికి మూలకారణమై విశ్వకర్మలు సృష్టికర్తలుగా నిలిచారు. కానీ చరిత్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో విశ్వకర్మల కృషి గురించి ఎక్కడ నమోదు కాలేదు కనీసం పేర్లు కూడా చరిత్రపుటల్లోకి ఎక్కలేదు. వీలైనంత మేర అందుబాటులో ఉన్న సమాచారాన్ని డిజిటలైజ్ చేసి రేపటి తరాలకు అందించడం. కుటుంబం చేత నిరాదరించబడ్డ లేదా తల్లిదండ్రులను కోల్పోయిన విశ్వకర్మ సమాజపు పిల్లలను చేరదీసి వారిని ఉన్నత లక్ష్యాలు గల భావి పౌరులుగా తీర్చిదిద్దడం. విశ్వకర్మ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో స్టడీ సర్కిల్లను / పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడం, పోటీ పరీక్షలకు సమాయత్తం చేయడం, ఉన్నత విద్యలు పొందాలన్న లక్ష్యాలను సాధించేందుకు దోహదపడడం. విశ్వకర్మల సమగ్ర సాధికారతే లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన కార్యాచరణతో విశ్వకర్మలను గ్రామస్థాయిలో చైతన్యం చేయడం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు వారికి విశదీకరించి మార్పులకు అనుగుణంగా అభివృద్ధిని సాధించడం. రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రాల వారీగా క్షేత్రస్థాయిలో విశ్వకర్మ నెట్వర్క్ని ఏర్పాటు చేసి విశ్వకర్మ ప్రజల్ని రాజకీయంగా చైతన్యం చేయడం, తద్వారా రాజకీయ శక్తిగా మారేందుకు కృషి చేస్తోందని. తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి, విశ్వబ్రాహ్మణ సీనియర్ నాయకులు కోసూరి రమేష్ , రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మహిళా నాయకురాలు రామోజు మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *