Breaking News

రాష్ట్ర అభివృద్ధిలో మీడీయా పాత్రపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక ప్రసంగం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.రాఘవాచారి ఎపి మీడియా అకాడమీ ఆధ్వర్యం లో నిర్వహిస్తోన్న “డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులతో పాటు, రాష్ట్రం లోని వర్కింగ్ జర్నలిస్టులకు ఆన్ లైన్ అవగాహనా తరగతుల్లో భాగంగా ఈ శనివారం (27-05-23) న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రత్యేక ప్రసంగం ఇవ్వ నున్నారని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. “రాష్ట్రాభివృద్ధి లో మీడియా పాత్ర”, “పాజిటివ్ రిపోర్టింగ్ మరియు నెగటివ్ రిపోర్టింగ్” అనే అంశాల పై శనివారం ఉదయం 9నుంచి 10 గంటల వరకు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రసంగిస్తారని ఆ ప్రకటన లో చైర్మన్ పేర్కొన్నారు. పత్రికా రంగంలో విశేష అనుభవం కలిగిన సజ్జల రామకృష్ణా రెడ్డి అనుభవాన్ని ప్రసంగ రూపంలో అందించడం గొప్ప అవకాశమని,”డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రచయిత, సీనియర్ జర్నలిస్టు  గోవిందరాజు చక్రధర్ “వార్తలు – విలువలు” అనే అంశం పై ప్రసంగిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *