-జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా పట్టాలను అందచేసేందుకు అన్ని ఏర్పాట్లు, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, పురోగతి, వసతుల కల్పన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు గురువారం సాయంత్రం అయిన గుడివాడ వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, టిడ్కోలో మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని, రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. టిడ్కో గృహాల తుది మెరుగుల దశను పూర్తి చేయాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఇంటి పట్టాలను సీఎం లబ్ధిదారులకు అందిస్తామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు.
గుడివాడ మండలం మల్లయపాలెం లోని టిడ్కో ఇళ్ల నిర్మాణాల పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు . త్వరలో ముఖ్యమంత్రి గుడివాడలో పర్యటించి టిడ్కో గృహ సముదాయాలను లబ్ధిదారులందరికీ అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 80 ఎకరాలలో 8,912 టిడ్కో గృహాలను మొదటి, రెండు దశలలో నిర్మాణాలను చేపట్టి అన్ని మౌలిక వసతులను కల్పించి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని. మిగిలిన మైనర్ పనులు భూమిని మెరక చేయడం, ముఖద్వార నిర్మాణం వంటి పనులు పూర్తవుతున్నాయని చెప్పారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మరో పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడ్కో గృహా లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందించనున్నామని చెప్పారు. గుడివాడ ఆర్డిఓ తరచూ టిడ్కో సముదాయాలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి గృహాల ప్రారంభోత్సవ సమయానికి మిగిలిన అన్ని పనులు అన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన సభాస్థలి ప్రాంతంలో మిగిలిపోయిన ఇనుప ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను తక్షణమే తొలగించాలన్నారు అలాగే టిడ్కో ఇళ్ల సముదాయంలో చిన్ని చిన్ని పనులను పూర్తి చేయాలన్నారు. 177 ఎకరాలలోని మల్లయ్య పాలెం జగనన్న ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలిస్తూ, లేఅవుట్లో మౌలిక వసతులను కల్పించి లబ్ధిదారులు గృహాలను త్వరితగతిన నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. మంజూరైన 4 వేల గృహాలలో 2,100 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఆయనకు అధికారులు తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు,ఎంపీడీవో వెంకటరమణ, తహసీల్దారు కే.ఆంజనేయులు, హౌసింగ్ డీఈ రామోజీ నాయక్,విద్యుత్ శాఖ ఏడి వెంకటేశ్వర్లు, గ్రామ మండల సర్వే అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News