విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలకతీతంగా ఓట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల సమాభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 10వ డివిజన్ 47వ సచివాలయం పరిధిలోని ఆర్ ఆర్ గార్డెన్స్ ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాన్ని అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 10వ డివిజన్ లో గడప గడపకు వెళ్తుంటే ప్రజలు బ్రమ్మరథం పడుతుంటే చాల ఆనందం గా ఉంది అన్నారు. నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మా ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించారని స్థానికులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలు విసుగుచెందారు అన్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని, రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టే స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారంటేనే అర్థం అవుతుంది ప్రజల గుండెల్లో అవి ఎంతగా నిలిచి ఉన్నాయని అన్నారు. ప్రజలు కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని మరలా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని అవినాష్ కోరారు.ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్,వైస్సార్సీపీ నాయకులు ఉదయ్,సతీష్ రెడ్డి,శివ నాగేశ్వరరావు,కాకాని బాబు,అచుతారావు,సూర్యనారాయణ బాబు,తమ్మారెడ్డి,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News